12 Years Boy : చపాతీలు తినటం వల్ల కంటి చూపు కోల్పోయిన బాలుడు

బరువు తగ్గటానికి చాలామంది చపాతీలు తింటారు. అటువంటి చపాతీలు తినటం వల్ల 12 ఏళ్ల పిల్లాడికి కంటిచూపు పోయిందని గుర్తించి డాక్టర్లు కూడా షాక్ అయ్యారు.

12 Years Boy : చపాతీలు తినటం వల్ల కంటి చూపు కోల్పోయిన బాలుడు

12 Year Old Boy 1206 Mg Blood Sugar

12 year old boy with 1206 mg blood sugar level : బరువు తగ్గటానికి చాలామంది చపాతీలు తింటారు. అటువంటి చపాతీలు ఓ పసిపిల్లాడి కంటి చూపు పోగొట్టాయి అంటే నమ్ముతామా?అయ్యబాబోయ్ చపాతీలు తింటే కంటిచూపు పోయిందా?అని భయపడిపోతాం.కానీ అదేం కాదు. కానీ ఓ 12 ఏళ్ల పిల్లాడికి మాత్రం చపాతీలు తినటం వల్లనే కంటిచూపు పోయిందని గుర్తించి డాక్టర్లు కూడా షాక్ అయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ పిల్లాడికి ఎందుకు కంటిచూపు పోయింది.అదికూడా చపాతీలు తినటం వల్లే అనే విషయం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఏ ఆహారం ఎంత మోతాదులో తినాలి? ఏఏ సమయాల్లో తినాలి అనే విషయం తెలుసుకుని తినాలి లేదంటే ఇదిగో ఈ పిల్లాడిలాగే బాధపడాల్సి వస్తుంది.

మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలోని ఖోడ్ గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలుడు సందీప్. రోజు రోజుకూ కంటి చూపు తగ్గిపోతోంది. ఇక ఓ రోజు ఏకంగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.అప్పటికే సందీప్ నెమ్మదిగా శ్వాస తీసుకుంటున్నాడు. శరీరంలో ఎలాంటి కదలికా లేదు. గుండె మాత్రం నెమ్మదిగా కొట్టుకుంటోంది. దీంతో కంగారుపడిపోయిన తండ్రి బన్వారి ఆదివాసి వెంటనే కొడుకుని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ డాక్టర్ దీపక్ గౌతం అనే డాక్టర్ సందీప్ కు టెస్టులు చేశారు. టెస్టులు చూసి షాకయ్యారు డాక్టర్ దీపక్. కారణం సందీప్ శరీరం మధుమేహం (షుగర్ లెవెల్స్) స్థాయి 1200కు పైగా లెవెల్లో ఉంది. సాధారణంగా 140 లోపు ఉండాల్సిన షుగర్ కౌంట్ 1206కు చేరుకుంది. ఇది సామాన్య విషయం కాదు. చిన్నారి ప్రాణాలకే ప్రమాదం.

ఇంత చిన్న పిల్లాడికి ఇంత తీవ్రస్థాయిలో షుగర్ లెవెల్స్ ఉండటంతో ఆశ్చర్యపోయిన డాక్టర్ సందీప్ తినే ఆహారం గురించి తండ్రి బన్వారీని ప్రశ్నించగా..సందీప్ రోజూ 40 చపాతీలు తింటాడని చెప్పాడు. అది విన్న తరువాత డాక్టర్ దీపక్ మాట్లాడుతూ..అధికంగా చపాతీలు తినటం వల్లనే సందీప్ ఈ పరిస్థితి వచ్చిందని తెలిపారు. సందీప్ తలలో చీము చేరుకోవటం వల్ల కంటి చూపు దెబ్బతిందని తెలిపారు. ఆ తరువాత సందీప్ తండ్రి అనుమతితో ఐదు రోజుల్లో రెండు కళ్లకు డాక్టర్ అనంత్ రాఖోరే ఆపరేషన్ చేశారు. అతడి తల నుంచి 720 ఎంఎల్ చీమును తీశారు.ఆపరేషన్ తరువాత సందీప్ కోలుకుంటున్నాడు. దీంతో సందీప్‌కు మళ్లీ కంటి చూపు తిరిగొచ్చింది. రెండు కళ్లు కనిపించటం ప్రారంభించాయి.

ఈ ఆపరేషన్ తరువాత డాక్టర్ రాఖోరే మాట్లాడుతూ..అతడి తలలో చేరుకున్న చీము కారణంగానే చూపూ కోల్పోయాడని చెప్పారు. అలాగే అతడి బ్లడ్ షుగర్ స్థానికి నియంత్రించటానికి డాక్టర్లు 6 యూనిట్ల ఇన్సులిన్ ఇంజక్షన్లు ఇచ్చామని తెలిపారు. సందీప్‌ బ్లడ్ షుగర్ స్థాయి సాధారణ స్థాయికి చేరుకున్న తరువాత జిల్లా ఆసుపత్రిలోని ఆప్తాల్మజిస్ట్ డాక్టర్ గిరిష్ చతుర్వేది అతడిని పరిశీలించారు. చిన్నారి డయాబెటిక్ రెటినోపతి వ్యాధితో బాధపడుతున్నాడని తెలిపారు.