Fifty Teeth: పదేళ్ల బాలుడి నోటిలో 50 పళ్లు, ఆపరేషన్‌లో 30 పళ్లు తొలగింపు

ఇండోర్‌లో పదేళ్ల బాలుడికి నోటిలో ఆశ్చర్యకరంగా 50దంతాలు రాగా.. అరుదైన శస్త్రచికిత్స చేసి వికృతంగా ఉన్న 30 పళ్లను తొలగించారు డాక్టర్లు.

Fifty Teeth: పదేళ్ల బాలుడి నోటిలో 50 పళ్లు, ఆపరేషన్‌లో 30 పళ్లు తొలగింపు

Teeth

Fifty Teeth: ఇండోర్‌లో పదేళ్ల బాలుడికి నోటిలో ఆశ్చర్యకరంగా 50దంతాలు రాగా.. అరుదైన శస్త్రచికిత్స చేసి వికృతంగా ఉన్న 30 పళ్లను తొలగించారు డాక్టర్లు.

ఈ అరుదైన శస్త్ర చికిత్స చేసిన అనంతరం చిన్నారి ఆరోగ్యంపై వైద్యులు అబ్జర్వేషన్‌లో ఉంచారు. ప్రైవేట్ రంగంలోని మోడ్రన్ డెంటల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ సెంటర్ సర్జన్ డాక్టర్ సచిన్ ఠాకూర్ ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ కేసు గురించి డాక్టర్ సచిన్ ఠాకూర్ మాట్లాడుతూ, ‘చాలా కాలంగా దంతాల వాపు, నొప్పితో బాధపడుతున్న 10 ఏళ్ల బాలుడిని మా ఆసుపత్రికి తీసుకువచ్చారు.

అరుదైన వైకల్యం కారణంగా అతని నోటిలో మొత్తం 50 దంతాలు ఉన్నాయని ఎక్స్-రేలో గుర్తించాం. వైద్యపరంగా, “ఒడొంటోమా” అని పిలువబడే ఈ వైకల్యం లక్ష మందిలో ఒకరు లేదా ఇద్దరిలో కనిపిస్తుంది. సకాలంలో చికిత్స చేయకపోతే రోగికి ఇది తీవ్రంగా మారుతుంది.

సుమారు రెండున్నర గంటలపాటు జరిగిన ఆపరేషన్‌లో ముగ్గురు సభ్యుల సర్జన్ల బృందం చిన్నారి పాల దంతాల కింద ఏర్పడిన 30 పళ్లను తొలగించింది. అతని ఆరోగ్యకరమైన దంతాలు మాత్రమే అభివృద్ధి జరిగినట్లు ఠాకూర్ చెప్పారు.

ఆపరేషన్ తర్వాత బాలుడు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. బాలుడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. 18 సంవత్సరాల వయస్సు వరకు బాలుడి నోటిలో 32 ఆరోగ్యకరమైన దంతాలు రావచ్చని చెప్పారు.