Free Auto Ambulance : భార్య తాళిబొట్టు తాకట్టు పెట్టి..ఆటోను అంబులెన్స్‌గా మార్చిన డ్రైవర్..ఆక్సిజన్ తో ప్రాణాలు నిలుపుతున్న పేదవాడి పెద్ద మనస్సు 

కష్టంలో ఉన్నవారికి సహాయం చేయటానికి పేద గొప్పా తేడా లేదని నిరూపించాడు భోపాల్ లోని ఓ ఆటో డ్రైవర్. తన ఆటోనే అంబులెన్స్ గా మార్చేశాడు. దానికి కావాల్సిన డబ్బు కోసం భార్య తాళిబొట్టుని తాకట్టుపెట్టాడు. ఆ డబ్బులతో ఆటోని అంబులెన్స్ గా మార్చి కరోనా బాధితులకు ఫ్రీగా ఆక్సిజన్ అందిస్తు పెద్ద మనస్సును చాటుకుంటున్నాడు.

Free Auto Ambulance : భార్య తాళిబొట్టు తాకట్టు పెట్టి..ఆటోను అంబులెన్స్‌గా మార్చిన డ్రైవర్..ఆక్సిజన్ తో ప్రాణాలు నిలుపుతున్న పేదవాడి పెద్ద మనస్సు 

Bhopal Auto Driver Free Auto Ambulance

Bhopal Auto driver Free Auto Ambulance : ఆస్పత్రిలో బెడ్లు దొరకక్కా..దొరికినా ఆక్సిజన్ లేక…ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఇటువంటి దయనీయ స్థితి చూసిన చాలామంది పెద్ద మనస్సుని చాటుకుంటున్నారు. తమకు తోచిన సహాయం చేస్తున్నారు. సహాయం చేయటానికి పేద గొప్పా తేడా లేదని నిరూపించాడు ఓ ఆటో డ్రైవరు. ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్కా..దొరికినా ఆక్సిజన్ అందుబాటులో లేక జనాలు చనిపోతుంటే చూసి తట్టుకోలేకపోయిన ఓ ఆటో డ్రైవర్ గొప్ప మనస్సుని చాటుకున్నాడు. తన ఆటోనే అంబులెన్స్ లా మార్చేశాడు. ఆటోలో అచ్చం ఆస్పత్రిలో అందించినట్లుగా ఆక్సిజన్ సిలిండర్ ను కూడా అందుబాటులో ఉంచాడు. ఆటో నడిపితే వచ్చే డబ్బులతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నా..గానీ..ఆక్సిజన్ తో పాటు రోగులకు తన ఆటో అంబులెన్స్ లో ఉచితంగా సేవలందిస్తు పెద్ద మనస్సుని

చాలామంది మరణిస్తున్నారు. ఈ కష్టకాలంలో మధ్యప్రదేశ్ భోపాల్‌కు చెందిన ఆటో-రిక్షా డ్రైవర్ జావేద్ ఖాన్ అనే ఆటో డ్రైవర్ గొప్ప మనస్సును చాటుకున్నాడు. తన ఆటోను అంబులెన్స్‌గా మార్చి, దానిలో ఆక్సిజన్ సిలిండర్ ఏర్పాటు చేసి ఉచితంగా సేవలు అందిస్తున్నాడు. అయితే ఆక్సిజన్ సిలిండర్ నింపడానికి రోజుకు అతను 600రూపాయలు ఖర్చుచేస్తున్నాడు. తన ఆటో అంబులెన్స్ లో అన్నీ ఫ్రీయే నని చెబుతున్నాడు.

ఈ సందర్భంగా జావేద్ ఖాన్ మాట్లాడుతూ..కరోనా ప్రజల ప్రాణాల్ని హరిస్తున్న్ ఈ దారుణ పరిస్థితులను చూశాక..నా వంతుగా నేనేమైనా సహాయం చేయాలి అని అనుకున్నాను. కానీ ఆటో నడిపితేనేగానీ కుటుంబాన్ని పోషించుకోలేని నేను ఏం చేయగలను? అని అనుకున్నాను. కానీ సహాయం అనేది చిన్నదా పెద్దదా అని కాదు ఏదొకటి చేయాలనుకుని ఇలా నా ఆటోని అంబులెన్స్ గా మార్చానని చెప్పాడు. నా ఆటో అంబులెన్స్ లో ఆక్సిజన్ ను కూడా అందుబాటులో ఉంచానని దీని కోసం బాధితుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోనని చెప్పాడు.

అంతేకాదు కరోనా బాధితులంటేనే ఆమడదూరం పారిపోయే ఈరోజుల్లో జావేద్ తన ఆటోలో బాధితుల్ని ఫ్రీగానే ఆస్పత్రికి తరలిస్తున్నాడు. ఎవరికైనా అత్యవసరమైతే తనకు ఫోన్ చేయాలంటూ కూడా సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేశాడు. ప్రస్తుతం జావేద్ ఖాన్ చేస్తున్న సేవలను అందరూ సోషల్ మీడియా ద్వారా ప్రశంసల జల్లు కురిపిస్తున్నాడు. పేదవాడి పెద్ద మనస్సుకు హ్యాట్సాఫ్ చెబుతన్నారు.

కోవిడ్ -19 కేసుల పెరుగుతున్న పరిస్థితుల్లో ప్రజలు పడుతున్న బాధను చూసి తన ఆటోను అంబులెన్సుగా మార్చి సేవలందిస్తున్నానని జావేద్ ఖాన్ తెలిపాడు. 18 సంవత్సరాలుగా ఆటో నడుపుతున్నానని.. తన కుటుంబంలో ఎవ్వరికీ కరోనా సోకలేదని..బయట ఆక్సిజన్ లేక.. సకాలంలో ఆసుపత్రికి వెళ్లలేక బాధితులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపాడు. అందుకే వారికోసం ఏదైనా చేయాలనే సంకల్పంతో తన భార్య తాళిబొట్టును తాకట్టు పెట్టి ఆటోను అంబులెన్సుగా మార్చానని తెలిపాడు. ఈ క్రమంలో తన భార్య గొలుసును తాకట్టు పెట్టి.. ఆటోలో శానిటైజర్లు, కొన్ని మందులు, ఆక్సిజన్ సిలిండర్‌ను ఏర్పాటు చేశానని వెల్లడించాడు.