Madhya Pradesh: డీజే పెట్టారని పెళ్లి చేసేందుకు నిరాకరించిన మత పెద్ద.. తర్వాత ఏం జరిగిందంటే

ఒక మత గురువు కూడా పెళ్లిలో ఏర్పాటు చేసిన డీజే, డాన్స్‌లపై తన అసహనం వ్యక్తం చేశాడు. డీజే ఏర్పాటు చేసిన కారణంగా పెళ్ళి (నిఖా) జరిపించేందుకు అతడు నిరాకరించాడు. డీజే ఏర్పాటు చేసిన వరుడి కుటుంబ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Madhya Pradesh: డీజే పెట్టారని పెళ్లి చేసేందుకు నిరాకరించిన మత పెద్ద.. తర్వాత ఏం జరిగిందంటే

Madhya Pradesh: ఏ పెళ్లి వేడుక జరిగినా డీజే, డాన్స్ కామన్ అయిపోయింది. ఈ తతంగంపై కొందరు సంప్రదాయవాదులు మండిపడుతున్నారు. సంప్రదాయబద్ధంగా జరగాల్సిన వివాహాల్ని ట్రెండ్ పేరుతో చెడగొడుతున్నారని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Ranji Trophy Title: రంజీ ట్రోఫీ విజేతగా సౌరాష్ట్ర… ఫైనల్‌లో బెంగాల్‌పై ఘన విజయం.. సత్తా చాటిన ఉనాద్కత్

వీటిని నియంత్రించాలని అలాంటి వాళ్లు డిమాండ్ చేస్తుంటారు. తాజాగా ఒక మత గురువు కూడా పెళ్లిలో ఏర్పాటు చేసిన డీజే, డాన్స్‌లపై తన అసహనం వ్యక్తం చేశాడు. డీజే ఏర్పాటు చేసిన కారణంగా పెళ్ళి (నిఖా) జరిపించేందుకు అతడు నిరాకరించాడు. డీజే ఏర్పాటు చేసిన వరుడి కుటుంబ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఘటన ఇటీవల మధ్యప్రదేశ్‌లోని చతార్‌పూర్‌లో జరిగింది. అక్కడి ఒక ముస్లిం కుటుంబానికి సంబంధించిన పెళ్లి వేడుక జరిపించేందుకు మత గురువు హాజరయ్యాడు.

Youngest Organ Donor: తండ్రి కోసం పదిహేడేళ్ల కూతురు త్యాగం.. అతి చిన్న వయసులో లివర్ దానం.. అరుదైన రికార్డు

ఒక పక్క పెళ్లి వేడుక జరుగుతుంటే, మరో పక్క డీజే, డాన్స్‌లు కూడా వరుడి కుటుంబ సభ్యులు నిర్వహించారు. దీనిపై మత గురువు అసహనం వ్యక్తం చేశారు. ‘‘మన సమాజంలో ఇలాంటి అనవసరమైన వాటిపై నిషేధం ఉంది. ముఖ్యంగా పెళ్లి వేడుకల్లో డీజేలు పెట్టడం, డాన్సులు చేయడం సరికాదు. ఈ సమాజంలో అందరూ సమానమే. ముస్లిం సమాజంలో డాన్స్‌లు చేయడం, డీజేలు పెట్టడం నిషేధం. ముస్లిం సమాజానికి చెందిన చాలా మందితో చర్చించి గతంలోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇలాంటివి సరికాదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

మత పెద్ద వ్యాఖ్యల నేపథ్యంలో పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు మత పెద్దకు క్షమాపణలు చెప్పారు. డీజే, డాన్స్‌లు ఆపేయించారు. దీంతో మత పెద్ద తిరిగి తన పెళ్లి తంతు నిర్వహించాడు. పెళ్లి తంతు చాలా మామూలుగా జరిగేలా సహకరించాలని గతంలో ముస్లిం సంఘాలు పిలుపునిచ్చాయి. పెళ్లిళ్లలో హంగు, ఆర్భాటాల పేరుతో జరుగుతున్న అనవసర ఖర్చులు తగ్గించే ఉద్దేశంతోనే ముస్లిం సంఘాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.