రోడ్డు పక్కన “టీ” అమ్మే వ్యక్తితో సీఎం ముచ్చట్లు

రోడ్డు పక్కన “టీ” అమ్మే వ్యక్తితో సీఎం ముచ్చట్లు

sivraj singh మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చాలా సింపుల్‌గా ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. శనివారం రెండు రోజుల పర్యటన కోసం ఆయన జబల్‌పూర్ వెళ్లారు. జబల్‌పూర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం అనంతరం నగర వీధుల్లో తిరుగుతూ స్థానిక ప్రజలతో సీఎం చౌహాన్ మాట్లాడారు. ఈ క్రమంలోనే రోడ్డు పక్కన ఉన్న ఓ చిన్న టీ స్టాల్ వద్దకు వెళ్లి టీ తాగారు సీఎం.

టీ తాగుతూ టీ కొట్టు యజమాని పప్పు గుప్తా,ఆయన భార్యతో కాసేపు ముచ్చటించారు. పిల్లలు ఎంతమంది? మీ పిల్లలు ఏం చదువుతున్నారు? ఏ స్కూల్ లో చదువుతున్నారు? అని పప్పు గుప్తా భార్యను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యాపారం ఎలా సాగుతుంది? ప్రతి రోజు ఎంత డబ్బు వస్తుంది? ఎవరెవరు ఇక్కడికి వస్తారు? అని పప్పు గుప్తాని సీఎం అడగ్గా.. సార్, మా టీ స్టాల్ దగ్గరికి కేవలం లేబర్ మాత్రమే వస్తారు అని పప్పు గుప్తా సమాధానం చెప్పగా.. నేను కూడా లేబర్‌నే అయ్యా అని శివరాజ్ సింగ్ అన్నారు. ఏ పని కూడా చిన్నది కాదని.. కష్టపడి పనిచేయాలని సీఎం సూచించారు. మనదేశంలో టీ అమ్మే వ్యక్తి కూడా ప్రధాని కాగలడు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అలా పప్పు గుప్తాతో 20 నిమిషాల పాటు మాట్లాడారు సీఎం శివరాజ్ సింగ్. సీఎం తన షాపుకి వచ్చి టీ తాగడంతో ఉబ్బితబ్బిబైపోయారు పప్పు గుప్తా. సీఎం వచ్చి తమ షాపు టీ తాగడం,తమను ఆప్యాయంగా పలకరించడం తమకు చాలా సంతోషాన్ని కలిగించిందని పప్పు గుప్తా తెలిపారు.