Miyazaki Mangoes : OMG.. 2 చెట్లకు నలుగురు మనుషులు, 6 కుక్కలతో భారీ కాపలా

మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో ఓ రైతు తన తోటలోని రెండు మామిడి చెట్లకు 6 కుక్కలు, నలుగురు మనుషులతో కాపలా ఉంచారు.

Miyazaki Mangoes : OMG.. 2 చెట్లకు నలుగురు మనుషులు, 6 కుక్కలతో భారీ కాపలా

Miyazaki Mangoes

Miyazaki Mangoes : మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో ఓ రైతు తన తోటలోని రెండు మామిడి చెట్లకు 6 కుక్కలు, నలుగురు మనుషులతో కాపలా ఉంచారు. రెండు చెట్లకు ఇంత భారీ కాపలా ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే ఆ చెట్లు అతడి పాలిట కల్ప వృక్షాలు మరి. మియాజాకి జాతికి చెందిన వీటికి కాసిన మామిడి పండ్లు గతేడాది కిలోకు రూ.2.70లక్షలు పలికాయి. దీంతో వీటిని దొంగలు ఎత్తకెళ్లకుండా ఇలా భారీ కాపలా ఏర్పాటు చేశారు. ఆ చెట్లకు 6 పండ్లే ఉండటం మరో విశేషం.

రాణి, సంకల్ప్ పరిహర్ అనే జంట కొన్నేళ్ల క్రితం వారి తోటలో రెండు మామిడి చెట్లు నాటారు. ఇతర మొక్కల్లానే అవీ పెరుగుతాయని వారు అనుకున్నారు. అయితే ఊహించని విధంగా ఆ చెట్ల నుంచి జపాన్ కి చెందిన మియాజాకి జాతికి చెందిన మామిడి పండ్లు కాశాయి. అంతే, వారి లైఫ్ ఒక్కసారిగా టర్న్ అయ్యింది. మియాజాకి జాతి మామిడి పండ్లు ప్రపంచంలోనే ఖరీదైనవిగా గుర్తింపు పొందాయి. గతేడాది అంతర్జాతీయ మార్కెట్ లో ఈ రకం మామిడి పండ్లు కిలో రూ.2.70లక్షలు పలికాయి.

తమ తోటలో ఉన్నది అరుదైన, ఖరీదైన మామిడి పండ్లు అనే విషయం బయటకు తెలిసే సరికి.. గతేడాది తన తోటలో దొంగలు పడ్డారని, మామిడి పండ్లు ఎత్తుకెళ్లారని సంకల్ప్ తెలిపాడు. ఏదో ఒక విధంగా ఆ చెట్లకు కాపాడుకుంటూ వచ్చామని చెప్పాడు. దొంగల భయంతో చెట్లకు భారీ కాపలా ఏర్పాటు చేశానన్నాడు. అరుదైన చెట్లను, ఏడు మామిడి పండ్లను కాపాడుకోవడం కోసం నలుగురు గార్డులు, ఆరు కుక్కలను కాపలాగా ఉంచినట్టు తెలిపాడు. ఈ రకం మామిడి పండ్లు మన దేశంలో ఎక్కడా పండవు. వీటిని సూర్యుడి గుడ్డు అని కూడా అంటారు.

”ఓసారి ట్రైన్ లో చెన్నైకి వెళ్తుండగా ఓ వ్యక్తి కనిపించి తనకు మామిడి మొక్కలు ఇచ్చాడని సంకల్ప్ తెలిపాడు. వాటిని తనకు ఇచ్చి సొంత పిల్లల్లా చూసుకోవాలని ఆ వ్యక్తి చెప్పాడని సంకల్ప్ చెప్పాడు. ఆ మొక్కలను తీసుకొచ్చి నా తోటలో నాటాను. అసలు వాటికి ఏ రకం మామిడి పండ్లు కాస్తాయో కూడా తెలియకుండానే మొక్కలు నాటాను. గతేడాది ఆ చెట్లకు మామిడి పండ్లు కాశాయి. అవి చాలా విభిన్నంగా ఉన్నాయి. ఆ రకం పండ్లను ఏమంటారో కూడా నాకు తెలీదు. వాటికి నా తల్లి దామిని పేరు పెట్టాను. ఆ తర్వాత ఆ పండ్ల గురించి పరిశోధన చేసి వాటి అసలు పేరు కనుగొన్నాము. అయితే ఇప్పటికీ ఆ పండ్లు నాకు దామినినే” అని సంకల్ప్ అంటాడు.

”మామిడి పండ్ల సాగుదారులు, పండ్ల ప్రియులు మమ్మలి సంప్రదించారు. ఆ పండ్లను ఇవ్వాలని కోరారు. ఓ వ్యాపారి ఒక్కో పండుకి రూ.21వేలు ఇస్తానని చెప్పాడు. ముంబైకి చెందిన బంగారు ఆభరణాల వ్యాపారి అయితే.. ఎంత అడిగితే అంత ఇస్తామని ముందుకొచ్చాడు. కానీ మేము ఎవరికీ పండ్లు అమ్మాలని అనుకోవడం లేదు. ఎందుకంటే ఆ పండ్ల సాయంతో మరిన్ని చెట్లు పెంచాలని అనుకుంటున్నాము” అని సంకల్ప్ భార్య రాణి అంది.