ఎమ్మెల్యే కూతురికి తప్పలేదు : ప్రభుత్వాసుపత్రిలో 12 గంటలు గర్భిణికి నరకం

  • Published By: veegamteam ,Published On : November 21, 2019 / 07:17 AM IST
ఎమ్మెల్యే కూతురికి తప్పలేదు : ప్రభుత్వాసుపత్రిలో 12 గంటలు గర్భిణికి నరకం

ప్రభుత్వ హాస్పిటల్స్ అంటేనే హడలిపోయే పరిస్థితి. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ప్రసవం కోసం వెళ్లిన మహిళలకే కాదు పలువురు రోగులకు నరకం చూపిస్తున్న ఘటనలు చూస్తున్నాం. ఇది సామాన్యులకే కాదు ఓ ఎమ్మెల్యే కూతురికి కూడా తప్పలేదు. ఓ ఎమ్మెల్యే తన కుమార్తెకు ప్రసవం కోసం ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. అక్కడ 12 గంటల పాటు ఆమెను పట్టించుకోలేదు. గంటల తరబడీ ఆమె పురిటి నొప్పులతో నరకం చూసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షియోపూర్ జిల్లా కేంద్ర హాస్పిటల్ లో జరిగింది. 

షియోపూర్ జిల్లా విజయపూర్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సీతారాం ఆదివాసీ. తన కుమార్తెను ప్రసవం కోసం షియోపూర్ జిల్లా కేంద్ర హాస్పిటల్ కు నవంబర్ 18న  ఉదయం 9 గంటలకు తీసుకువెళ్లారు. తరువాత ఆమెను పరీక్షించాలని చెప్పిన సిబ్బంది ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు వెయింటింగ్ లిస్ట్ లో పెట్టారు. తరువాత ఆమెకు ఫ్లూయిడ్స్ ప్రాబ్లమ్ ఉందనీ..సీజేరియన్ ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. ఆ తరువాత అనస్థీయా డాక్టర్ లేరనీ..మరో హాస్పిటల్ కు తీసుకువెళ్లాలని చెప్పి చేతులు దులుపుకున్నారు. 

దీనిపై ఎమ్మెల్యే సీతారాం మాట్లాడుతూ..ప్రసవం కోసం తన తన కుమార్తెకు ప్రభుత్వ హాస్పిటల్ తీసుకు వస్తే 12 గంటల పాటు వెయింటింగ్ లో పెట్టి…పట్టించుకోకుండా ఆమెను బాధకు గురిచేశారనీ .. సిజేరియన్ ఆపరేషన్ చేయటానికి అనస్థీషియా డాక్టరు అందుబాటులో లేరని తాపీగా చెప్పారని ..12 గంటల తరువాత ఆమెను షివపూరి, గ్వాలియర్ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని డాక్టర్లు చెప్పి తమ పని అయిపోయినట్లుగా వ్యవహరించారనీ..ఎమ్మెల్యే సీతారాం ఆవేదన వ్యక్తంచేశారు. 

అలా తన కుమార్తెను ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్లు పట్టించుకోకపోవటంతో ఆమెను ఓ ప్రైవేటు హాస్పిటల్ కు తీసుకువెళ్లానని..అక్కడ ఆపరేషన్ అవసరం లేకుండానే నార్మల్ డెలివరీ చేశారని ఎమ్మెల్యే సీతారామ తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ల  తీరుపై ఎమ్మెల్యే ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేశారు. కాగా అనస్థీషియా వైద్యుడు లేనందువల్లే తాము గర్భిణీకి శస్త్రచికిత్స చేయలేక పోయామని గవర్నమెంట్ డాక్టర్ ఆర్బీ గోయల్ చెప్పుకొస్తున్నాడు.