MP Farmer: గేదె పాలు ఇవ్వట్లేదని కేసు పెట్టిన రైతు.. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదే కదా?

గేదె పాలు ఇవ్వకపోతే పశువుల డాక్టర్ దగ్గరకు వెళ్తాం కదా? కానీ, ఓ రైతు మాత్రం పోలీసుల దగ్గరకు వెళ్లాడు.

MP Farmer: గేదె పాలు ఇవ్వట్లేదని కేసు పెట్టిన రైతు.. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదే కదా?

Mp Farmar

MP Farmer: గేదె పాలు ఇవ్వకపోతే పశువుల డాక్టర్ దగ్గరకు వెళ్తాం కదా? కానీ, ఓ రైతు మాత్రం పోలీసుల దగ్గరకు వెళ్లాడు. మధ్యప్రదేశ్‌లోని బింద్‌ జిల్లాలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. తన గేదె పాలివ్వట్లేదంటూ ఓ రైతు పోలీసులను ఆశ్రయించాడు. నేరుగా గేదెను తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గేదె కొన్ని రోజులుగా పాలు ఇవ్వట్లేదని, తనని పాలు కూడా పితకనివ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

బాబూ లాల్‌ జాతవ్‌ అనే రైతు నాయ్‌గావ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఈమేరకు కేసు పెట్టాడు. కొద్దిరోజులుగా తన గేదె పాలివ్వడం లేదని తెలిపాడు. బహుశా ఎవరైనా చేతబడి చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు.

తన గేదెకు గ్రామంలో ఎవరో చేతబడి చేశారని, అందుకే పాలు ఇవ్వట్లేదని లిఖిత పూర్వకంగా కంప్లైంట్‌ చేశాడు రైతు. అతడి పరిస్థితిని అర్థం చేసుకున్న పోలీసులు కంప్లైంట్ తీసుకుని, అతడికి నచ్చజెప్పి పశు వైద్యుడి దగ్గరకు పంపారు. పశు వైద్యుడి వద్దకు వెళ్లిన రైతు.. గేదెకు వైద్యం చేయించాడు. మరుసటి రోజే గేదె పాలిచ్చిందని సంతోషం వ్యక్తం చేశాడు రైతు. తన గేదె పాలిచ్చేందుకు కారణమైన పోలీసులకు ధన్యవాదాలు చెప్పాడు రైతు.

గేదెతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన వీడియో నెట్టింట వైరల్‌ అయ్యింది. రైతు చేసిన పనికి కోప్పడకుండా సమస్యకు పరిష్కారం చూపేలా ప్రయత్నం చేసిన పోలీసులను కూడా అభినందిస్తున్నారు.

Nathy Kihara : బాడీలో ఆ ఒక్క పార్ట్‌కి 13 కోట్ల బీమా చేయించిన హీరోయిన్.. ఆ పార్ట్ ఏంటో తెలుసా??