మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం : సీఎం పదవిపై బీజేపీలో తర్జనభర్జనలు

  • Published By: madhu ,Published On : March 12, 2020 / 10:08 AM IST
మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం : సీఎం పదవిపై బీజేపీలో తర్జనభర్జనలు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఉత్కంఠను రేకేత్తిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన జ్యోతిరాదిత్య సింథియా..తిరుగుబాటు జెండా ఎగురవేయడం..బీజేపీలో చేరిపోవడంతో కమల్ నాథ్ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వాన్ని కాపాడుకొనేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంటే..మరోవైపు సీఎం పదవిపై బీజేపీలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. నేతలు బిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

22 మంది ఎమ్మెల్యేల్యు రాజీనామా పత్రాలను స్పీకర్‌కు ఇచ్చిన సంగతి తెలిసిందే. మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్..శాసనసభ పార్టీ చీఫ్‌గా ఎన్నికయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, చౌహాన్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విడి శర్మ, ఇతర కీలక నేతలు రాష్ట్ర రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు. 

అయితే..చౌహాన్ నాయకత్వాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. 13 సంవత్సరాల నుంచి సీఎం పదవిలో కొనసాగారని, ఇతర నాయకులకు అవకాశం ఇవ్వాలని కొందరు వెల్లడిస్తున్నారు.

See Also | మూడు రాజధానుల నిర్ణయం దుర్మార్గం అన్నారు, నెల రోజులు తిరక్కుండానే వైసీపీలో చేరిపోయారు

ఇవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేస్తున్నారు ఇతర నేతలు. కేవలం సమావేశంలో తాము రాజ్యసభ ఎన్నికల గురించి మాత్రమే మాట్లాడడం జరిగిందంటున్నారు. 2005లో శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత..రాష్ట్రం అభివృద్ధి బాటలో కొనసాగిందని, ఆయనకు ఎంతో అనుభవం ఉందని వెల్లడిస్తున్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్‌ను విస్మరించడం బీజేపీ కేంద్ర నాయకత్వానికి కష్టమౌతుందని, ఆయనకు ఉన్న ఆదరణను నిర్ణయం తీసుకొనే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు గిరిజ శంకర్ వెల్లడించారు. దీనిపై స్పందించడానికి కేంద్ర బీజేపీ నాయకులు నిరాకరించారు. 

Read More : కేజ్రీవాల్ మార్కు : సామాన్యుడికి అందుబాటులో స్కూల్ ఫీజులు