కొడుకు పరీక్ష కోసం 105 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన తండ్రి

  • Published By: madhu ,Published On : August 20, 2020 / 06:57 AM IST
కొడుకు పరీక్ష కోసం 105 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన తండ్రి

కొడుకు పరీక్ష కోసం ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 105 కిలోమీటర్లు దూరం సైకిల్ తొక్కాడు ఓ తండ్రి. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ తండ్రి ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.



ఇటీవలే అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకం తీసుకొచ్చింది. పదో తరగతి పరీక్షల్లో మొదటి ప్రయత్నంలో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కోసం ‘రుక్ జానా నహీ’ అనే స్కీం తీసుకొచ్చింది. మరోసారి పరీక్షలు నిర్వహిస్తోంది. థార్ డిస్ట్రిక్ లోని తనవార్ తహసీల్ లోని బేడీపూర్ మారుమూల గ్రామంలో శోభ్రామ్ నివాసం ఉంటున్నాడు.



ఇతని కొడుకు పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. మరోసారి పరీక్ష రాయాలని అనుకున్నాడు. అయితే..పరీక్ష సెంటర్ బేడీపూర్ గ్రామం నుంచి 105 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల అమలవుతున్న లాక్ డౌన్ వల్ల ప్రభుత్వ రవాణా వ్యవస్థ అందుబాటులో లేదు. పోనీ..ప్రైవేటు వాహనాల్లో వెళ్లి వద్దామని అనుకుంటే..అంత డబ్బు లేదు. చివరకు తన దగ్గరున్న సైకిల్ ను నమ్ముకున్నాడు. రెండు రోజులకు సరిపడా ఫుడ్ సంచీల్లో పెట్టుకున్నాడు.



కొడుకును సైకిల్ పై ఎక్కించుకుని సోమవారం ఉదయం తన గ్రామం నుంచి బయలుదేరాడు శోభ్రామ్. మనవార్ పట్టణంలో రాత్రి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నారు. మరలా మంగళవారం ఉదయం సైకిల్ తొక్కడం ప్రారంభించాడు. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి శోభ్రామ్ తన కొడుకుతో చేరుకున్నాడు. సైకిల్ తొక్కుతున్న ఇతని ఫొటోను కొంతమంది సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది.