Navaneet Kaur to SC : క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దుపై సుప్రీంకోర్టుకు వెళ్తా.. నవనీత్ కౌర్

సినీనటి, అమరావతి పార్లమెంట్ సభ్యురాలు నవనీత్ కౌర్‌‌కు బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆమె క్యాస్ట్ సర్టిఫికెట్‌ను హైకోర్టు రద్దు చేసింది. హైకోర్టు తీర్పుపై తాను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ఎంపీ నవనీత్ కౌర్ అన్నారు.

Navaneet Kaur to SC : క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దుపై సుప్రీంకోర్టుకు వెళ్తా.. నవనీత్ కౌర్

Navaneet Kaur To Sc

Navaneet Kaur Rana to move Supreme Court : సినీనటి, అమరావతి పార్లమెంట్ సభ్యురాలు నవనీత్ కౌర్‌‌కు బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆమె క్యాస్ట్ సర్టిఫికెట్‌ను హైకోర్టు రద్దు చేసింది. హైకోర్టు తీర్పుపై తాను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ఎంపీ నవనీత్ కౌర్ అన్నారు. నవనీత్ కౌర్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు కాదని, నకిలీ క్యాస్ట్‌ సర్టిఫికెట్‌తో ఆమె పోటీచేసి గెలుపొందారని ఆరోపణలు వెల్లువెత్తాయి.

మాజీ ఎంపీ, శివసేన నేత ఆనందరావు అదసూల్ బాంబే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నవనీత్‌ కౌర్‌.. కులధ్రువీకరణ పత్రాన్ని రద్దుచేసింది. అంతేకాదు.. రూ.2 లక్షల జరిమానా కూడా విధించింది. ఆరు నెలల్లోగా కులధ్రువీకరణకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లను కోర్టు ఎదుట సమర్పించాలని నవనీత్ కౌర్‌ను కోర్టు ఆదేశించింది.

తన కుల సర్టిఫికెట్‌ను బాంబే హైకోర్టు రద్దు చేయడంపై నవనీత్‌ కౌర్‌ స్పందించారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తాను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని నవనీత్ చెప్పారు. ‘నేనొక దేశ పౌరురాలిగా బాంబే హైకోర్టు ఆదేశాన్ని గౌరవిస్తాను. నా లాయర్ల ద్వారా నేను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాను. అక్కడ నాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది’ అని ఎంపీ నవనీత్‌ కౌర్‌ అన్నారు. మహారాష్ట్ర అమరావతి (ఎస్సీ రిజర్వ్‌డ్) లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసి నవనీత్ కౌర్ విజయం సాధించారు. నవనీత్ భర్త రవి రాణా ప్రస్తుతం అమరావతి జిల్లా బద్నేరా ఎమ్మెల్యేగా ఉన్నారు. గత 9ఏళ్లుగా అమరావతి నియోజకవర్గంలో నవనీత్ కౌర్ ప్రజల కోసం పోరాడుతున్నానని ఆమె తెలిపింది.