Grandma Car Drivng : బామ్మా నువ్వు సూపర్.. 90ఏళ్ల వయసులో అద్భుతంగా కారు డ్రైవింగ్.. సీఎం సైతం ఫిదా

90ఏళ్ల వయసు అంటే.. ఇంట్లో ఓ మూలన కూర్చుని కృష్ణా, రామా అంటూ కాలం గడిపేస్తారు. ఇదీ అందరిలోనూ కామన్ గా ఉండే అభిప్రాయం. కానీ ఆ భావన పూర్తిగా తప్పు అని నిరూపించింది ఈ బామ్మ. 90 ఏళ్ల వయ

Grandma Car Drivng : బామ్మా నువ్వు సూపర్.. 90ఏళ్ల వయసులో అద్భుతంగా కారు డ్రైవింగ్.. సీఎం సైతం ఫిదా

Grandma Car Driving

Grandma Car Driving : వయసు పైబడిన వారు, వృద్ధులు ఏం చేస్తారు అంటే.. ఇంట్లో ఏదో ఓ మూలన కూర్చుని కృష్ణా, రామా అంటూ కాలం గడిపేస్తారు. ఇది కామన్. అందరిలోనూ ఉండే అభిప్రాయం కూడా ఇదే. కానీ ఆ భావన పూర్తిగా తప్పు అని నిరూపించింది ఈ బామ్మ. 90 ఏళ్ల వయస్సులోనూ తనకున్న ఆసక్తిని వ్యక్తపరచడమే కాదు తన కోరిక మేరకు కారు డ్రైవింగ్ కూడా నేర్చుకుంది. కేవలం రోజుల వ్యవధిలోనే డ్రైవింగ్ నేర్చుకుని హైవేపై రయ్‌మంటూ దూసుకెళ్లింది. బామ్మ కారు డ్రైవింగ్ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తుండగా.. కొందరు వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.

Hybrid Flying Car : ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.. ఫ్ల‌యింగ్ కారు వచ్చేస్తోంది, మేడిన్ ఇండియా

మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లా బిలావాలికి చెందిన రేషమ్ బాయ్ తన్వర్ కు 90ఏళ్లు. అయితే ఆమెకు కారు డ్రైవింగ్‌ పట్ల ఆసక్తి ఉంది. అంతే, కారు డ్రైవింగ్ క్లాస్‌లో చేరింది. కొద్ది రోజుల్లోనే డ్రైవింగ్ పూర్తిగా నేర్చేసుకుంది. ఈ క్రమంలోనే హైవేపై మారుతి 800 కారు డ్రైవింగ్ చేస్తూ తన కోరికను నెరవేర్చుకుంది. హైవేపై కారు డ్రైవింగ్ చేస్తున్నంత సేపు ఆ బామ్మ కళ్లలో ఎంతో ఆనందం కనిపించింది. అంతగా డ్రైవింగ్‌ను ఆస్వాదించింది ఆ బామ్మ.

ఈ బామ్మ డ్రైవింగ్‌ ను చూసి నెటిజన్లే కాదు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సైతం ఫిదా అయిపోయారు. బామ్మ ప్రయత్నానికి, కాన్ఫిడెన్స్ కు సలాం కొట్టారు. ఈ వీడియోను సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా షేర్ చేశారు. రేషమ్.. ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారంటూ కొనియాడారు. ‘ఆసక్తి, జీవితంలో ఏదైనా సాధించాలనే తపన ఉండాలే కానీ వయసుతో సంబంధం లేదని అని ఈ బామ్మ నిరూపించింది. అందరిలో స్ఫూర్తి నింపింది. ఏ వయసు వారైనా సరే జీవితాన్ని ఆస్వాదించాలనే అభిరుచి ఉండాలి’’ అని సీఎం చౌహాన్ కొటేషన్ పెట్టారు.

Malware ముప్పు.. బ్యాంకు యూజర్లకు వార్నింగ్, క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ

కాగా, తనకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టమని రేషమ్ చెప్పారు. కార్లతో పాటు ట్రాక్టర్లు కూడా నడుపుతానని తెలిపారు. ఏది ఏమైనా 90 ఏళ్ల ప్రాయంలోనూ చలాకీగా కారు డ్రైవ్ చేయడం అనేది అసాధారణ విషయం అంటున్నారు నెటిజన్లు. 90ఏళ్ల వయసులోనూ డ్రైవింగ్ చేస్తూ అదరగొట్టేసిన ఈ బామ్మకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంటున్నారు. సీఎం చౌహాన్ షేర్ చేసిన వీడియోని ఎంతోమంది లైక్ చేశారు, షేర్ కూడా చేశారు. కొందరు నెటిజన్లు బామ్మ డ్రైవింగ్ నైపుణ్యాన్ని మెచ్చుకున్నారు. బామ్మా నువ్వు సూపర్ అన్నారు.