వైరల్ అవుతున్న ఎంపీల డ్యాన్స్ వీడియో

  • Published By: venkaiahnaidu ,Published On : September 20, 2019 / 09:49 AM IST
వైరల్ అవుతున్న ఎంపీల డ్యాన్స్ వీడియో

దసరా సెలబ్రేషన్స్ కి వెస్ట్ బెంగాల్ రెడీ అయ్యింది. కోల్ కతాలో దసరా సంబరాలు ఎలా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ దసరా సెలబ్రేషన్స్ లో భాగంగా తృణముల్ మహిళా ఎంపీలు చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దుర్గ నవరాత్రులపై తృణముల్ కాంగ్రెస్ మహిళా ఎంపీలు మిమి చక్రవర్తి, నస్రత్ జహాన్ లు ఓ సాంగ్ చేశారు. మరో నటి సుభశ్రీ గంగూలీతో కలిసి ఈ సాంగ్ ను చేశారు. మి చక్రవర్తి ,నస్రత్ లు సంప్రదాయబద్ధమైన చీరల్లో మెరుపులు మెరిపించారు. సోమవారం దీనికి సంబంధించిన ఓ చిన్న వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఇంద్రదిప్ దాస్ గుప్తా కంపోజ్ చేసిన ఆషే మా దుర్గా సే అనే సాంగ్ కి వీరు చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. లక్షలాది వ్యూస్ తో ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

సినిమాలు వదిలి తృణముల్ కాంగ్రెస్ లో చేరిన పోటీ చేసిన మొదటిసారే మిమి చక్రవర్తి, నస్రత్ జహాన్ లు ఎంపీలుగా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్ లోని బసిర్ హాట్ స్థానం నుంచి నుస్రత్ ఎంపీగా విజయం సాధించగా,జాదవ్ పూర్ నుంచి మిమిచక్రబొర్తి విజయం సాధించారు.