NCC లో సంస్కరణలు..నిపుణుల కమిటీ సభ్యులుగా ధోనీ,ఆనంద్ మ‌హీంద్రా

దేశ యువ‌త‌లో వ్య‌క్తిత్వం, క్ర‌మ‌శిక్ష‌ణ‌, నిస్వార్థ సేవ‌ను ప్రోత్స‌హించే ల‌క్ష్యంతో ప‌నిచేసే దేశంలోని అతిపెద్ద సంస్థ NCC. అయితే నేషనల్​ కెడెట్ కార్ఫ్స్​(NCC)ను ప్రస్తుత

NCC లో సంస్కరణలు..నిపుణుల కమిటీ సభ్యులుగా ధోనీ,ఆనంద్ మ‌హీంద్రా

Mahi,dhoni

NCC దేశ యువ‌త‌లో వ్య‌క్తిత్వం, క్ర‌మ‌శిక్ష‌ణ‌, నిస్వార్థ సేవ‌ను ప్రోత్స‌హించే ల‌క్ష్యంతో ప‌నిచేసే దేశంలోని అతిపెద్ద సంస్థ NCC. అయితే నేషనల్​ కెడెట్ కార్ఫ్స్​(NCC)ను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చేందుకు రక్షణ శాఖ కసరత్తులు ప్రారంభించింది.

NCCలో మార్పులు చేర్పులు చేపట్టే అంశంపై సమగ్ర సమీక్ష నిర్వహించేందుకు ఎంపీ బైజ‌యంత్ పాండా నేతృత్వంలో ఓ అత్యున్న‌త స్థాయి నిపుణుల‌ క‌మిటీని ఏర్పాటు చేసింది. ఈ క‌మిటీలో మాజీ క్రికెట‌ర్ ఎంఎస్ ధోనీతో, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మ‌హీంద్రాలకు కూడా చోటు కల్పించారు.

ఎంపీ రాజ్య‌వ‌ర్ధ‌న్ సింగ్ రాథోడ్‌, ఎంపీ వినయ్ సహస్ర బుద్ధే, ఆర్థిక‌శాఖ ప్ర‌ధాన ఆర్థిక స‌ల‌హాదారు సంజీవ్ స‌న్యాల్‌, జామియా మిలియా ఇస్లామియా వీసీ న‌జ్మా అక్త‌ర్‌, ఎస్ఎన్‌డీటీ వుమెన్స్ యూనివ‌ర్సిటీ మాజీ వీసీ వ‌సుధా కామ‌త్‌ వంటి వాళ్లు ఈ క‌మిటీలో ఉన్నారు.

స‌మ‌కాలీన ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ఎన్సీసీలో చేయాల్సిన మార్పుల‌పై ఈ క‌మిటీ అధ్య‌య‌నం చేయ‌నుంది. జాతి నిర్మాణంలో ఎన్సీసీ క్యాడెట్లు మ‌రింత ప్ర‌భావ‌వంతంగా పాల్గొనేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ఈ క‌మిటీ సిఫార్సులు చేయ‌నుంది. గ‌తంలో ఎన్సీసీలో ఉన్న వాళ్ల సేవ‌ల‌ను కూడా ఇందులో భాగంగా ఎలా వినియోగించుకోవాల‌న్న‌దానిపై సూచ‌న‌లు ఇవ్వ‌నుంది.

READ PM Modi : రక్షణ కార్యాలయ సముదాయాన్ని ప్రారంభించిన ప్రధాని;సెంట్ర‌ల్ విస్టా విమ‌ర్శ‌కుల‌పై ఫైర్‌