Mukesh Ambani : రూ.100 కోట్లకు మించిన ముఖేశ్ అంబానీ 4 ఆస్తులేంటో తెలుసా?

ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముకేశ్ అంబానీ ఆస్తుల విషయంలోనే కాదు. ఆయన దక్కించుకున్న విలువైన వస్తువుల్లోనూ స్పెషల్ మార్క్ కనిపిస్తుంటుంది. మసారెటీ లెవంటె లేదా బెంట్లీ బెంటాయగా వంటి...

Mukesh Ambani : రూ.100 కోట్లకు మించిన ముఖేశ్ అంబానీ 4 ఆస్తులేంటో తెలుసా?

Mukesh Ambani

ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముకేశ్ అంబానీ ఆస్తుల విషయంలోనే కాదు. ఆయన దక్కించుకున్న విలువైన వస్తువుల్లోనూ స్పెషల్ మార్క్ కనిపిస్తుంటుంది. మసారెటీ లెవంటె లేదా బెంట్లీ బెంటాయగా వంటి 168 అత్యంత ఖరీదైన కార్లను సొంతం చేసుకున్న ముకేశ్ అంబానీకి ఇలా ఖర్చు చేయడం ఈ రిలయన్స్ అధినేతకు ఒక దినచర్య అనికూడా చెప్పవచ్చు.

ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో… రిసార్టులు, బంగ్లాలు, వ్యాపారాలు ఉన్న ఈ అపరకుబేరుడి 100 కోట్ల రూపాయల విలువైన నాలుగు ఆస్తులు ఏంటో తెలుసా..

Antila (1)

Antila (1)

అధికారిక నివాసం – అంటిలా
ముకేశ్ అంబానీ అధికారిక నివాసం అంటిలియా భవనం. ముంబైలోని అల్టామౌంట్ రోడ్డులో ఉన్న ఈ 27 అంతస్తుల ఎత్తైన ఇంట్లో సకల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఈ భవనంలో 9 వేగవంతమైన లిఫ్ట్స్ ఉన్నాయి. కారు పార్కింగ్ కోసం మూడు ఫ్లోర్లు కేటాయించారు. ఈ నివాసంలో సినిమా థియేటర్, స్విమ్మింగ్ పూల్, జిమ్, టెంపుల్, హాస్పిటల్ ఉంటాయి. ఈ బిల్డింగ్ విలువ వంద కోట్లకు పైనే.

Uk Resort Ambani (1)

Uk Resort Ambani (1)


స్టోక్‌ పార్క్‌
పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సంస్థ… ముకేశ్ అంబానీ కోసం బ్రిటన్‌కు చెందిన దిగ్గజ కంట్రీ క్లబ్, లగ్జరీ గోల్ఫ్‌ రిసార్ట్‌…. స్టోక్‌ పార్క్‌ను కొనుగోలు చేసింది. దీని విలువ 57 మిలియన్‌ పౌండ్లు (రూ. 592 కోట్లు). సుమారు 300 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన పురాతన లగ్జరీ ప్యాలస్ ను ఈఏడాది ఏప్రిల్ లో రిలయన్స్ సంస్థ కొనుగోలు చేసింది. 49 బెడ్ రూమ్ లు, గోల్ఫ్ క్లబ్, ఇతర లగ్జరీ సౌకర్యాల ఉన్న ఈ స్టోక్‌ పార్క్‌ ప్యాలస్… పలు జేమ్స్‌ బాండ్‌ సినిమాల్లోనూ చూసే ఉంటాం.

Mumbai Indians (1)

Mumbai Indians (1)

ఐపీఎల్ ఫ్రాంచైజీ – ముంబై ఇండియన్స్
అన్నింటా తమదైన ముద్రవేసిన ముకేశ్ అంబానీ… దేశంలో ఆటలకు ఉన్న క్రేజ్ తో ఒక స్పోర్ట్స్ క్లబ్ నే మొదలు పెట్టేశారు. అందులో భాగంగా మొదటగా ఐపీఎల్ క్రికెట్ ఫ్రాంచైజ్ ను సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్ టీమ్ ను కొనుగోలు చేసారు. ఈ జట్టు ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ నెగ్గింది. రెండు సార్లు ఛాంపియన్స్ ట్రోపి విజేతగా నిలిచింది. 2017లోనే జట్టు విలువ రూ.100 కోట్లకు చేరుకున్నట్లు ది ఎకనామిక్ టైమ్స్ తెలిపింది.

Hamleys (1)

Hamleys (1)

బొమ్మల తయారీ కంపెనీ – హామ్లీస్‌
261 ఏళ్ల క్రితం యూకేలో ప్రారంభించిన హామ్లీస్‌ అనే బొమ్మల తయారీ కంపెనీని ముకేశ్ నేతృత్వంలోని రిలయన్స్ సంస్థ 2019లో కొనుగోలు చేసింది. దీని విలువ 88.5 మిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో రూ. 650 కోట్లు. కొనుగోలుకు ముందు పీకల్లోతు నష్టాల్లో ఉన్న కంపెనీని రిలయన్స్ సంస్థ కొనుగోలు చేయడంతో ప్రపంచ వ్యాపార దిగ్గజాలు సైతం ఆశ్చర్యపోయారు. ప్రపంచంలో ఉండే పిల్లల నిష్పత్తిలో ఐదు శాతం మంది ఈ హామ్లీస్‌ కంపెనీ తయారు చేసిన ఆట బొమ్మలను ఇష్టపడతారు. ఈ కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది.