అంబానీ ఇప్పుడు రిచెస్ట్ ఏషియన్ కాదు.. ఆ కిరీటం ఆలీబాబా జాక్‌మాది

  • Edited By: vamsi , March 10, 2020 / 09:22 AM IST
అంబానీ ఇప్పుడు రిచెస్ట్ ఏషియన్ కాదు.. ఆ కిరీటం ఆలీబాబా జాక్‌మాది

భారత వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఇకపై ఆసియాలో అత్యంత ధనవంతుడు కాదు.. అవును గ్లోబల్ స్టాక్స్‌తో పాటు చమురు ధరలు కుప్పకూలిన తరువాత ఆసియా అత్యంత ధనవంతుడుగా జాక్ మా మారిపోయాడు. కరోనావైరస్ వ్యాప్తి ప్రపంచాన్ని మాంద్యంలోకి నెట్టివేస్తుందనే భయంతో మార్కెట్లు పడిపోయాయి. ముడిచమురు ధరల పతనంతో ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలడం ప్రపంచ కుబేరుల స్ధానాలనూ కదిలించింది.

ఈ క్రమంలోనే ఆసియాలో అత్యంత సంపన్నుడి స్ధానాన్ని భారత పారిశ్రామికదిగ్గజం ముఖేష్‌ అంబానీ కోల్పోయారు. ముకేశ్ అంబానీ ఒక్క రోజులోనే రూ.44,000 కోట్లు పోగొట్టుకోగా.. రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) షేరు ధర ఇంట్రాడేలో ఏకంగా 14 శాతం కుప్పకూలింది. రిలయన్స్ షేరు ధర ఇంట్రాడేలో రూ.1,095 స్థాయికి పతనమైంది. గత 11 ఏళ్లలో చూస్తే.. షేరు ధర ఇంట్రాడేలో ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి.

దీంతో అంబానీ నికర సంపద ఏకంగా 580 కోట్ల డాలర్లు తుడిచిపెట్టుకుపోగా.. ఆసియాలోనే అత్యంత సంపన్నుడి స్ధానాన్ని అలీబాబా గ్రూప్‌ అధినేత జాక్‌మా ఆక్రమించారు. ముఖేష్‌ అంబానీ కంటే 260 కోట్ల డాలర్ల అధిక సంపద (4450 కోట్ల డాలర్లు)తో జాక్‌మా ఆసియా సంపన్నుల్లో నెంబర్‌వన్‌గా నిలిచారు. అయితే ఇది తాత్కాలికమే అని, తిరిగి అంబానీ సత్తా చాటుతాడని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

See Also | ఛార్జ్ షీట్‌లో అసలు ఏముంది : మారుతీరావు ఆస్తులపై సంచలన విషయాలు వెలుగులోకి