Mukesh Ambani: వాట్సప్‌తో అమెజాన్‌ను దెబ్బకొట్టేందుకు ముఖేశ్ అంబానీ ప్లాన్

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో కొనసాగుతున్న అమెజాన్ గ్రోసరీస్ హవాను దెబ్బకొట్టేందుకు ముఖేశ్ అంబానీ వాట్సప్ ఎంచుకున్నారు. వాట్సప్ నుంచి వచ్చిన ఇన్విటేషన్ తో..

Mukesh Ambani: వాట్సప్‌తో అమెజాన్‌ను దెబ్బకొట్టేందుకు ముఖేశ్ అంబానీ ప్లాన్

Whatsapp

Mukesh Ambani: ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో కొనసాగుతున్న అమెజాన్ గ్రోసరీస్ హవాను దెబ్బకొట్టేందుకు ముఖేశ్ అంబానీ వాట్సప్ ఎంచుకున్నారు. వాట్సప్ నుంచి వచ్చిన ఇన్విటేషన్ తో జియో మార్ట్ ఓపెన్ చేసిన యూజర్లకు మినిమం ఆర్డర్ లేకుండా ఫ్రీ డెలివరీ చేయనున్నారు. దీనికి సంబంధించిన 90సెకన్ల ట్యూటోరియల్ కూడా ఉంటుంది.

పళ్లు, కూరగాయలు, టూత్ పేస్ట్, వంట వస్తువులు, పన్నీర్, చీజ్, పిండి లాంటివి ఏవైనా కొనుగోలు చేయొచ్చు. యాప్ లోనే వారి షాపింగ్ మొత్తం పూర్తి చేసేయొచ్చు. ఫేస్ బుక్ ప్లాట్ ఫామ్స్ లో బిజినెస్ మొదలైన 19నెలల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని కోసం ఇండియాలోని లార్జెస్ట్ ప్లాట్ ఫాం అయిన జియో ముందడుగేసి వాట్సప్ ద్వారా వచ్చిన కస్టమర్లకు అదనపు బెనిఫిట్స్ ఇస్తుంది. ఇప్పటి వరకూ జియోలో 425మిలియన్ కంటే ఎక్కువ మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు.

ఫుడ్ అండ్ గ్రోసరీస్ ఆర్డర్లు 2025నాటికల్ల 1.3ట్రిలియన్ డాలర్లకు చేరుకోవాలనేది అంచనా. ఇప్పటికే స్మార్ట్ ఫోన్ మార్కెట్లో దూసుకెళ్తున్న జియో.. రెగ్యూలర్ యూజర్ల కంటే కొత్త యూజర్లపైనే ఫోకస్ ఎక్కువ ఉంచింది.

……………………………………………: ఏంజెల్ రాశిఖన్నా.. మేకర్స్ స్పెషల్ విషెష్!

ఇప్పుడిక వాట్సప్ లో నుంచే లక్షల మంది యూజర్లు తమ ఆర్డర్లు బుక్ చేసుకోవచ్చు. పైగా జియో మార్ట్ కోసం ప్రత్యేకంగా మరో యాప్ ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం కూడా లేదు.