Mukesh Ambani: అనంత్-రాధిక నిశ్చితార్థ వేడుక.. అంబానీ కుటుంబం డ్యాన్స్ చూశారా!

ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబ సభ్యులతోపాటు అనిల్ అంబానీ దంపతులు, పలువురు బాలీవుడ్ తారలు హాజరయ్యారు. గుజరాత్ సంప్రదాయ పద్ధతిలో నిశ్చితార్థ వేడుక జరిగింది. కార్యక్రమం అనంతరం పలు సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు నిర్వహించారు.

Mukesh Ambani: అనంత్-రాధిక నిశ్చితార్థ వేడుక.. అంబానీ కుటుంబం డ్యాన్స్ చూశారా!

Mukesh Ambani: ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ-నీతా దంపతుల రెండో కుమారుడు అనంత్ అంబానీ నిశ్చితార్థ వేడుక ఇటీవల ఘనంగా జరిగింది. గుజరాత్ పారిశ్రామిక వేత్త వీరేన్ మర్చంట్-శైల దంపతుల కుమార్తె రాధికా మర్చంట్‌తో అనంత్ నిశ్చితార్థం జరిగింది. ముంబైలోని అంబానీ నివాసంలో ఈ వేడుక జరిగింది.

Komatireddy Venkat Reddy: రేవంత్‌తో భేటీ అయిన కోమటిరెడ్డి.. గాంధీ భవన్‌లో ఆసక్తికర ఘటన

ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబ సభ్యులతోపాటు అనిల్ అంబానీ దంపతులు, పలువురు బాలీవుడ్ తారలు హాజరయ్యారు. గుజరాత్ సంప్రదాయ పద్ధతిలో నిశ్చితార్థ వేడుక జరిగింది. కార్యక్రమం అనంతరం పలు సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముకేష్ అంబానీ కుటుంబం డాన్స్‌తో అలరించింది. ముకేష్ అంబానీ దంపతులు, ఆయన కుమార్తె ఇషా దంపతులు, పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ దంపతులు కలిసి చేసిన డాన్స్ అతిథుల్ని ఆకట్టుకుంది.

ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ముకేష్ కుటుంబం చేసిన డాన్స్ సందడిగా సాగింది. ఆ వీడియో మీరూ చూసేయండి.