బెంగాల్ ఎన్నికలు..148మంది అభ్యర్థులతో బీజేపీ జాబితా రిలీజ్

ఎనిమిది దశల్లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఐదు,ఆరు,ఏడు,ఎనిమిది దశల ఎన్నికల్లో పోటీ చేసే 148మంది అభ్యర్థుల జాబితాను గురువారం బీజేపీ విడుదల చేసింది.

బెంగాల్ ఎన్నికలు..148మంది అభ్యర్థులతో బీజేపీ జాబితా రిలీజ్

Mukul Roy In Bjps Latest List For West Bengal Polls`1

Bengal polls ఎనిమిది దశల్లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఐదు,ఆరు,ఏడు,ఎనిమిది దశల ఎన్నికల్లో పోటీ చేసే 148మంది అభ్యర్థుల జాబితాను గురువారం బీజేపీ విడుదల చేసింది. ఇందులో పార్టీ ఉపాధ్యక్షుడు ముకుల్​రాయ్, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు రాహుల్​ సిన్హా పేర్లు కూడా ఉన్నాయి.

పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ టీఎంసీ నేత ముకుల్​రాయ్​ ఉత్తర కృష్ణానగర్ నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన బీజేపీ. రాహుల్​ సిన్హాకు హబ్రా అసెంబ్లీ సీటు కేటాయించింది. వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు, సిట్టింగ్​ ఎంపీలకు ప్రాధాన్యమిచ్చే వ్యూహంతో ముందడుగేసింది బీజేపీ. హరింఘటా స్థానం నుంచి జానపద కళాకారుడు అశీమ్​ సర్కార్, పుర్బస్థలి ఉత్తర్​లో శాస్త్రవేత్త గోవర్ధన్​ దాస్​లను బీజేపీ పోటీలో నిలిపింది. ఇక, ఐదుగురు సిట్టింగ్​ ఎంపీలను కూడా జాబితాలో చేర్చింది.

294 స్థానాలున్న వెస్ట్ బెంగాల్ అసెంబ్లీకి మార్చి-27 నుంచి ఏప్రిల్-29వరకు ఎనిమిది దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే-2న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.