Mukul Roy : ముకుల్ రాయ్ కి వీఐపీ భద్రత కట్..TMCలోకి 25 బీజేపీ ఎమ్మెల్యేలు!

భారతీయ జనతా పార్టీకి గుడ్ బై చెప్పి ఇటీవలే తృణమూల్​ కాంగ్రెస్​లో చేరిన ముకల్ రాయ్ కు జడ్ కేటగిరీ సెక్యూరిటీని కేంద్రం ఉపసంహరించింది.

Mukul Roy : ముకుల్ రాయ్ కి వీఐపీ భద్రత కట్..TMCలోకి 25 బీజేపీ ఎమ్మెల్యేలు!

Mukul Roy

Mukul Roy భారతీయ జనతా పార్టీకి గుడ్ బై చెప్పి ఇటీవలే తృణమూల్​ కాంగ్రెస్​లో చేరిన ముకల్ రాయ్ కు జడ్ కేటగిరీ సెక్యూరిటీని కేంద్రం ఉపసంహరించింది. ఈ మేరకు రాయ్​కు అందిస్తున్న జెడ్ కేటగిరీ భద్రతా విధుల నుంచి వైదొలగాల్సిందిగా బుధవారం కేంద్ర హోంశాఖ సీఆర్‌పీఎఫ్​ను ఆదేశించింది. ముకుల్ రాయ్ కుమారుడు సుబ్రంగ్షుకు అందిస్తున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF) సీఐఎస్​ఎఫ్​ భద్రతనూ తొలగించింది హోంశాఖ.

ముకుల్ రాయ్ కు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జడ్ కేటగిరి భద్రత కల్పించింది కేంద్రం. 33 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మూడు షిప్ట్ లలో రాయ్ కు భద్రత కల్పించేవారు. అయితే తనకు వీఐపీ భద్రత అవసరం లేదని,జడ్ కేటగిరి భద్రతను తొలగించాలని కోరుతూ టీఎంసీలో చేరిన తర్వాత ముకుల్ రాయ్ కేంద్ర హోంమంత్రిత్వశాఖకు లేఖ రాసిన నేపథ్యంలోనే కేంద్రం ఆయనకు భధ్రత ఉపసంహరించినట్లు సమాచారం. తృణమూల్​ కాంగ్రెస్​ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన ముకుల్​ రాయ్​.. 2017లో పార్టీని వీడి బీజేపీలో చేరి ఆ పార్టీ జాతీయ ఉపాధ్య‌క్షునిగా సేవ‌లందించారు. గత వారం రాయ్ తన కుమారుడితో కలిసి తిరిగి సొంతగూటికి చేరిన విషయం తెలిసిందే. వీరికి ప్రస్తుతం రాష్ట్ర పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. ప్రస్తుతం కృష్ణానగర్ ఉత్తర నియోజకవర్గానికి రాయ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

అయితే ప్రస్తుతం బెంగాల్ లో 25మంది బీజేపీ ఎమ్మెల్యేలు,ఇద్దరు ఎంపీలు తృణముల్ కాంగ్రెస్ లో చేరేందుకు ఆ పార్టీ నేతలతో టచ్ లో ఉన్నారంటూ తాజాగా ముకుల్ రాయ్ కుమారుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీలో చేరిన చాలా మంది నేతలు తిరిగి టీఎంసీలోకి రానున్నట్లు ఆయన తెలిపారు.