Mumbai : ముంబైలో రేపటినుంచి ఆ స్కూళ్లన్నీ రీఓపెన్..

మహారాష్ట్ర రాజధాని ముంబైలో రేపటి నుంచి నుంచి స్కూళ్లు అన్నీ తిరిగి తెరుచుకోనున్నాయి. ఒకటో తరగతి నుంచి 7వ తరగతి వరకు అన్ని స్కూళ్లు తెరుచుకోనున్నాయి.

Mumbai : ముంబైలో రేపటినుంచి ఆ స్కూళ్లన్నీ రీఓపెన్..

Mumbai All Schools For Classes 1 To 7 To Reopen From Tomorrow, Says Bmc

Mumbai : మహారాష్ట్ర రాజధాని ముంబైలో రేపటి నుంచి బుధవారం (డిసెంబర్ 15) నుంచి స్కూళ్లు అన్నీ తిరిగి తెరుచుకోనున్నాయి. ఒకటో తరగతి నుంచి 7వ తరగతి వరకు అన్ని స్కూళ్లు తెరుచుకోనున్నాయి. కరోన మహమ్మారి తీవ్రత అధికంగా ఉన్న సమయంలో ఆయా స్కూళ్లను మూసివేయగా.. బుధవారం నుంచి తిరిగి తెరుచుకోనున్నట్టు బ్రిహ్మన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇదిలా ఉండగా.. ముంబైలో కరోనావైరస్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇప్పటికే కరోనా బారిన పడినవారి సంఖ్య క7,65,471కి పెరిగింది. ఒక్క సోమవారమే.. 174 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

కరోనా మరణాల సంఖ్య కూడా ఇద్దరు మరణించడంతో మొత్తంగా మరణాల సంఖ్య 16,359కి చేరినట్టు మున్సిపల్ కార్పొరేషన్ (BMC) తెలిపింది. ఇటీవలే 195 పేషెంట్లు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగా.. ముంబైలో కరోనా రికవరీల సంఖ్య 7,44,784కి చేరింది. మెట్రోపాలిస్ లో 1,751 యాక్టివ్ కేసులు ఉన్నాయని BMC తెలిపింది.

60 ఏళ్లు పైబడిన కొమొర్బిడిటీలు ఉన్న ఇద్దరు మరణించినట్లు ప్రకటనలో తెలిపింది. 31,415మంది శాంపిల్స్ పరీక్షించగా.. ముంబైలో కరోనావైరస్ పరీక్షల సంఖ్య 1,29,17,132 కు పెరిగింది. ముంబై రికవరీ రేటు 97 శాతంగా ఉండగా.. కరోనా కేసులు 2,557 రోజుల్లో రెట్టింపు అయినట్టు BMC వెల్లడించింది.

Read Also : Haiti Gas Tanker Explosion : పేలిన హైతీ గ్యాస్ ట్యాంకర్.. 50 మంది సజీవదహనం!