‘కరోనా యోధులకు’ బంగారు నాణాలు..రూ.5వేలు గిఫ్ట్ ఇచ్చిన బీజేపీ ఎంపీ

  • Published By: nagamani ,Published On : July 8, 2020 / 02:27 PM IST
‘కరోనా యోధులకు’ బంగారు నాణాలు..రూ.5వేలు గిఫ్ట్ ఇచ్చిన బీజేపీ ఎంపీ

కరోనా యోధులకు బీజేపీ ఎంపీ బంగారు నాణాలు పంచారు. కరోనా కష్టకాలంలో యోధులుగా మారిన పోలీసులు, వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్య కార్మికులకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని భావించిన నార్త్ ముంబై బీజేపీ ఎంపీ గోపాల్ శెట్టి సోమవారం 30 మంది కోవిడ్ యోధులను సోమవారం (జులై 6,2020)సత్కరించారు. ఒక్కొక్కరికీ ఓ బాంగారు నాణెంతో పాటు రూ.5వేలు నగదు బహుమతిని అందించారు.

కరోనా కష్టంకాలంలో ప్రజలకు ఆపద్బాంధవుల్లా మారారు పోలీసులు, వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్య కార్మికులు. ప్రాణాలకు తెగించి వారు ప్రజలను కరోనా మహమ్మారి బారి నుంచి కాపాడుతున్నారు. అందుకే వారిని ‘కరోనా యోధుల’ అంటున్నాం. ఎవ్వరూ బైటకు రాని సమయంలో కూడా వారు వారి విధుల పట్ల అంకిత భావంతో పనిచేశారు. అటువంటివారికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనిది.

వారికి ప్రతీ ఒక్కరూ కృతజ్ఞతగా ఏదో ఒక బహుమతి ఇవ్వాల్సిందే. వారి విలువను గుర్తించిన ఓ ఎంపీ వారికి ముందుగానే బంగారు నాణేలు అందించారు ఎంపీ గోపాల్ శెట్టి. కరోనా మహమ్మారితో యుద్ధంలో ముందుండి పోరాడుతున్న సెక్యూరిటీ గార్డులు, శానిటైజింగ్ వర్కర్లు, ఇతర పాలక సిబ్బందికి బంగారు నాణేలు అందించారు.

దీనిపై గోపాల్ శెట్టి మాట్లాడుతూ.. ‘కరోనా వైరస్‌పై యుద్ధంలో పారిశుద్య సిబ్బంది, పాలక సిబ్బంది చేస్తున్న సేవలు అనన్యసామాన్యమైనవి. వారి సేవలను ఎప్పటికి గుర్తు పెట్టుకోవాలి. అందుకే నగర వ్యాప్తంగా 30 మందికి ఒక గ్రాము బంగారు నాణెంతో పాటు రూ.5వేలు గిఫ్టుగా ఇవ్వాలని అనిపించిందని అన్నారు.

అనంతరం ఆయన సాత్రా పార్క్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ బోరివాలిలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్‌ను ప్రారంభించారు. కాగా, ముంబైలో ప్ర‌స్తుతం 85,724 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇప్పటివరకు కరోనాతో 4,938 మంది మృతిచెందారు. చైనాలో ఇప్ప‌టి వ‌ర‌కు 83,565 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 4వేల 634 మంది మృతి చెందారు.

ముంబై నగర వ్యాప్తంగా జులై ఒక‌టో తేదీ నుంచి ప్ర‌తి రోజు 1,100 కేసుల‌కు త‌గ్గ‌కుండా న‌మోదుకావటంతో ప్రజలకు భయాందోళనకుగురవుతున్నారు.

Read Here>>ICMR-కోవ్యాక్సిన్: ‘ఆగస్టు 15 నాటికి కరోనావైరస్ వ్యాక్సిన్’ వస్తుందా?