కరోనా ఎఫెక్ట్ : ఉమ్మి వేస్తే రూ. 1000 ఫైన్

  • Published By: madhu ,Published On : March 19, 2020 / 03:54 AM IST
కరోనా ఎఫెక్ట్ : ఉమ్మి వేస్తే రూ. 1000 ఫైన్

కరోనా భయపెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి విజృంభిస్తూ..వేలాది మందిని బలి తీసుకొంటోంది. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ దేశాలకు పాకుతోంది. ఫలితంగా ప్రజలు తీవ్ర భయాందోనళలకు గురవుతున్నారు. భారతదేశంలో కూడా వైరస్ లక్షణాలు కనబడుతుండడం కలకలం రేపుతోంది. దీంతో వైరస్‌ను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. అందులో భాగంగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. 

పారిశుధ్యం మెరుగుపర్చాలనే ఉద్దేశ్యంతో ముంబై నగరంలో ఇక నుంచి బహిరంగంగా ఎవరు ఉమ్మి వేసినా కఠిన చర్యలు తీసుకుంటామని బీఎంసీ మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. ఉమ్మివేస్తే..రూ. 200 నుంచి రూ. 1000 ఫైన్ వేస్తామని ప్రకటించింది. బహిరంగంగా ఉమ్మి వేసిన 107 మంది నుంచి రూ. 1.07 లక్షల రూపాయలను వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.

Read More : ఒంగోలులో కరోనా లక్షణాలు : ఏపీలో రెండో కేసు..హెల్ప్ లైన్ నెంబర్ల ఏర్పాటు

వైరస్ వ్యాప్తించకుండా ముంబై నగర ప్రజలు సహకరించాలని కోరుతున్నారు. ఉమ్మి వేస్తే..ఐపీసీ సెక్షన్ 189 ప్రకారం అరెస్టు కూడా చేస్తామని బీఎంసీ అధికారి హెచ్చరించారు. శానిటరీ సిబ్బంది, పోలీసులు ఈ చర్యను ఖచ్చితంగా అమలు చేయాలని సర్క్కూలర్ పేర్కొంది. ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసే విధంగా ఆయా సంస్థలు సూచించాలని తెలిపారు. ప్రస్తుతం ఎలాంటి కేసులు నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు.