Rs.1200 fine : పబ్లిక్ ప్లేస్ లో ఉమ్మి వేస్తే జేబుకు చిల్లే..

బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేస్తే ఇప్పటి వరకూ ఉన్న జరిమానాలు భారీగా పెంచారు ముంబై అధికారుల. ఇప్పటి వరకూ రూ.200లు ఉన్న జరిమానా మొత్తాన్ని రూ.1200లకు పెంచారు.

Rs.1200 fine : పబ్లిక్ ప్లేస్ లో ఉమ్మి వేస్తే జేబుకు చిల్లే..

Mumbai Civic Body Proposes Increase Fine For Spitting In Public Places

Spitting in Public Places Mumbai : బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకూడదు. ఉమ్మితే ఇకనుంచి జేబులకు చిల్లే. డస్ట్ బిన్స్ ఉన్నాగానీ చాలామంది రోడ్లపైనే కాదు ఎక్కడపడితే అక్కడ తుపుక్ మని ఉమ్మేస్తుంటారు. పరిశుభ్రత అనే మాటే పట్టదు. అందులోను ఈ కరోనా కాలంలో ఉమ్మి వేయటం అంటే..అదికూడా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేస్తే ఇంకేమన్నా ఉందా? కరోనా దాడికి ఊతం ఇచ్చినట్లే. ఈవిషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించాలి. ఎక్కపడితే అక్కడే ఉమ్మేయటం పరిశుభ్రతకు భంగం కలగటమే కాకుండా ఈ కరోనా కాలంలో అది మరింత ప్రమాదకరం.

ఈక్రమంలో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేస్తే ఫైన్ వేస్తున్నారు అధికారులు. ముఖ్యంగా నగరాల్లో ఇది మరింత ప్రమాదం. అలా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసే వారిపై ముంబై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. గతంలో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేస్తే జరిమానా రూ.200లు విధించేవారు. కానీ ఈకరోనా సెకండ్ వేవ్ లో ఉమ్మివేయటం ఎంతటి ప్రమాదానికి దారి తీస్తుందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఈక్రమంలో గతంలో ఉండే ఈ రూ.200ల జరిమానాను పెంచి రూ. 1200లు చేశారు మున్సిపల్ అధికారులు.

ముంబై అధికారులు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేస్తే ఇప్పటి వరకు రూ. 200 ఫైన్ మాత్రమే విధించే వారు. ఆ జరిమానా మొత్తాన్ని ఇప్పుడు రూ. 1200 పెంచాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనకు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆమోదం తెలిపింది. ఇకనుంచి బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే జేబులకు చిల్లు పడకతప్పదని హెచ్చరిస్తున్నారు అధికారులు. పరిశరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతీ పౌరుడికి ఉందని సూచించారు.

ఇప్పటి వరకు రూ. 200 మాత్రమే జరిమానా విధిస్తూ వచ్చినా ప్రజల్లో ఏమాత్రం మార్పు రాకపోవడంతో ఫైన్ మొత్తాన్ని పెంచాలని నిర్ణయించారు. అధికారుల ప్రతిపాదనకు ఆమోదం లభించాక చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కాగా..ముంబై నగరంలో జనాభా ఎంత భారీ స్థాయిలో ఉంటుందో తెలిసిందే. ఈ బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే తీసుకునే చర్యల్ని ముంబై అధికారులు అమలు చేస్తున్నా..జనాల్లో మాత్రం పెద్దగా సీరియస్ నెస్ రాలేదు. దీంతో జరిమానా పెంచితే డబ్బులు కట్టాల్సి వస్తుందనే భయంతోనే అయినా పాటిస్తారనే ఉద్ధేశ్యంతో అధికారులు ఇలా ఫైన్ మొత్తాన్ని పెంచారు. కాగా..ఇలా పబ్లిక్ ప్లేసుల్లో ఉమ్మివేసిన వ్యక్తులపై అధికారులు ఇప్పటిరవకూ రూ. 28.67 లక్షల జరిమానా విధించారు.