murga walk : మాస్క్ లేని వాళ్లను పోలీసులు ఏం చేశారో తెలుసా

ముంబైలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సముద్ర తీరం వద్ద తనిఖీలు నిర్వహించగా..కొంతమంది వ్యక్తులు మాస్క్ లేకుండా నిబంధనలు ఉల్లంఘిస్తూ తిరుగుతున్నారని గమనించారు.

murga walk : మాస్క్ లేని వాళ్లను పోలీసులు ఏం చేశారో తెలుసా

Mask

Mumbai cops : ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. భారతదేశంలో కూడా కరోనా సెకండ్ వేవ్ ప్రమాదఘంటికలను మ్రోగిస్తోంది. 8 రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోనళలకు గురవుతున్నారు. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకొనేందుకు సిద్ధమౌతున్నాయి. రాత్రి వేళ కర్ఫ్యూ విధించడం, కొన్ని ప్రాంతాల్లో వీకెండ్ లాక్ డౌన్ విధించడం చేస్తున్నాయి. ప్రధానంగా మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదవుతుండడంతో ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సిందేనని ప్రభుత్వ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కంపల్సరీ మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు. బహరింగ ప్రదేశాల్లో మాస్క్ లేని వారికి ఫైన్ వేస్తామని హెచ్చరిస్తున్నారు. కొంతమంది డోంట్ కేర్ అంటున్నారు. వీరికి పలు శిక్షలు విధిస్తున్నారు.

ముంబైలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సముద్ర తీరం వద్ద తనిఖీలు నిర్వహించగా..కొంతమంది వ్యక్తులు మాస్క్ లేకుండా నిబంధనలు ఉల్లంఘిస్తూ తిరుగుతున్నారని గమనించారు. వెంటనే వారిని పట్టుకున్నారు. ఒకరి తర్వాత..ఒకరిని లైన్ గా నిల్చొబెట్టారు. మోకాళ్లపై నడవాలని ఆదేశించడంతో వారు అలాగే చేశారు. మొకాళ్లపై నడుస్తుండగా..కొంతమంది ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పలు సందేశాత్మకం, ప్రజలను ఆలోచింపచేసే వీడియోలను పోస్టు చేసే వారిలో ఆనంద్ మహింద్ర ఒకరు. మొకాళ్లపై నడుస్తున్న వారి వీడియోను ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. దీనిని చూసిన తర్వాత..తనకు చిన్నప్పటి పాఠశాల గుర్తుకు వచ్చిందని, ఖచ్చితంగా మాస్క్ మరిచిపోలేనని తెలిపారు. కాసేపట్లోనే వైరల్ గా మారిపోయింది. లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. పోలీసుల చర్యలను చాలా మంది నెటిజన్లు ప్రశంసించారు.

Read More : Uttar Pradesh : చోరీ చేసిన సొమ్ము ఎక్కువగా ఉండడంతో దొంగకు గుండెపోటు