88ఏళ్ల తర్వాత ముంబై పోలీసులు గుర్రాలపై గస్తీ

88ఏళ్ల తర్వాత ముంబై పోలీసులు గుర్రాలపై గస్తీ

ముంబై పోలీసులు ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు మరోసారి పాత పద్ధతిని వాడబోతున్నారు. 1932లో గుర్రాలపై స్వారీ చేస్తూ.. విధులు నిర్వర్తించినట్లుగానే రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించనున్న పరేడ్‌లోనూ తమ గౌరవ వందనాన్ని సమర్పించనున్నారు. శివాజీ పార్క్ దీనికి వేదిక కానున్నట్లు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ ఆదివారం వెల్లడించారు.  

1932లో పోలీసులు వీధుల్లో పెట్రోలింగ్ నిర్వహించేందుకు పోలీసులు ఈ పద్ధతిని వాడేవారు. ట్రాఫిక్, వాహనాలు పెరిగిపోవడం వల్ల వీటికి దూరమైపొయ్యాం. నేటి ముంబై పోలీసులకు మోడరన్ జీపులు, మోటర్ సైకిళ్లు  వాడుతున్నారు. గుంపుగా ఉన్న ప్రాంతాల్లో క్రైమ్ పెట్రోల్ చేయడానికి ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇలా చేయడం ఇదే తొలిసారి.

బీచ్ ప్రాంతాల్లో, ఎత్తైన ప్రదేశాల్లోకి పోలీసులు వెళ్లడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. గుర్రంపై ఉన్న ఒక్క పోలీసు నేలపై ఉన్న 30మందితో సమానం. వచ్చే ఆరు నెలల్లో ఒక్క సబ్ ఇన్‌స్పెక్టర్ కింద 30 గుర్రాలు ఇస్తామని అన్నారు. ప్రస్తుతం 13గుర్రాలను కొనుగోలు చేశాం. మిగిలిన వాటిని ఒక ఆరు నెలల్లో తీసుకుంటాం. వాటి కోసం అంధేరీలో 2.5ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని వెల్లడించారు.