Mumbai court : వ్యభిచారం నేరం కాదు .. ఆమెను నిర్భంధిస్తే హక్కులు హరించినట్లే : ముంబయి కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

వ్యభిచారం నేరం కాదు అంటూ ముంబై కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యభిచార గృహంపై దాడులు చేసిన పోలీసులు 34 ఏళ్ల మహిళలను అరెస్ట్ చేసిన ఘటనపై ముంబై సెషన్స్ కోర్టు ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Mumbai court : వ్యభిచారం నేరం కాదు .. ఆమెను నిర్భంధిస్తే హక్కులు హరించినట్లే : ముంబయి కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

Mumbai court

Mumbai court :  వ్యభిచారం నేరం కాదు అంటూ ముంబై కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యభిచార గృహంపై దాడులు చేసిన పోలీసులు 34 ఏళ్ల మహిళలను అరెస్ట్ చేసిన ఘటనపై ముంబై సెషన్స్ కోర్టు ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా కోర్టు వ్యభిచారం నేరం కాదు కానీ బహిరంగ ప్రదేశాల్లో వ్యభిచారం చేస్తే నేరం అని వ్యాఖ్యానించింది. బహిరంగ ప్రదేశాల్లో వ్యభిచారం ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుందని.. 34 ఏళ్ల మహిళను ఎందుకు నిర్భంధించారు? అంటూ ప్రశ్నించింది. కోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

గత ఫిబ్రవరి (2023) ముంబయిలోని ములాండ్ ప్రాంతంలో ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు నిర్వహించారు. దీంట్లో భాగంగా 34 ఏళ్ల మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు విచారణ సందర్భంగా ఏడాది ఆమెను సంరక్షణ కేంద్రంలో ఉండాలని తీర్పునిచ్చారు. దాంతో ఆమె సెషన్స్ కోర్టును ఆశ్రయించింది. ఆ మహిళ కేసుపై విచారణ చేపట్టిన ముంబయి సెషన్స్ కోర్టు… ఆమెకు సంరక్షణ కేంద్రం నుంచి విముక్తి కల్పించాలని ఆదేశించింది.

బాధితురాలు మేజర్ అని…ఆమె స్వేచ్ఛకు భంగం కలిగించారని పైగా వ్యభిచారం చేస్తోందన కారణంతో ఆమెను నిర్బంధిస్తే ఆమె హక్కులకు భంగం కలిగించినట్టేనని సెషన్స్ కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఆమె బహిరంగ ప్రదేశంలో వ్యభిచారం చేసిందని పోలీసు నివేదికలో ఎక్కడా పేర్కొనలేదని.. అలాంటప్పుడు ఆమె నేరం చేసినట్టు కాదని స్పష్టం చేస్తు ఆమెను నిర్భంధం (కేర్ సెంటర్) నుంచి విడుదల చేయాలని ఆదేశించారు.

కేవలం పని పూర్వాపరాల ఆధారంగా బాధితురాలిని అదుపులోకి తీసుకోవడం సరికాదన్నారు. బాధితురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి తల్లి కావాలి. బాధితురాలిని ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా నిర్బంధిస్తే, అది ఆమె హక్కులను హరించినట్లేనని అన్నారు. సెక్స్ వర్కర్ల హక్కుల గురించి చర్చించిన సుప్రీంకోర్టు తీర్పును ఈ సందర్భంగా న్యాయమూర్తి ఉదహరణగా చెప్పారు. మేజర్ అయిన ఆమెను ఇష్టానికి విరుద్ధంగా కేర్ సెంటర్‌లో నిర్బంధించినందున వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.