రూ.10వేలు ఇవ్వలేదని గర్భవతి కడుపు మీద కొట్టిన కిరాతకుడు

రూ.10వేలు ఇవ్వలేదని గర్భవతి కడుపు మీద కొట్టిన కిరాతకుడు

45 ఏళ్ల వయస్సున్న కేబుల్ ఆపరేటర్.. 21ఏళ్ల Pregnantపై ఫిజికల్ అటాక్ చేయడంతో గర్భస్రావం అయింది. రెండు నెలల గర్భవతి రూ.10వేలు ఇవ్వలేదని కడుపుమీద కొట్టాడు. రిపోర్ట్ ప్రకారం.. మహిళ భర్తతో కేబుల్ ఆపరేటర్ కు పరిచయం ఉంది.

వ్యక్తిగత కారణాల రీత్యా మహిళ.. కేబుల్ ఆపరేటర్ దగ్గర్నుంచి రూ.10వేలు అప్పు అడిగి తీసుకుంది. చెప్పిన టైంకు డబ్బులు తిరిగి ఇవ్వలేకపోయింది. అక్టోబర్ 15న నిందితుడు ఆమెను అస్మా హాస్పిటల్ దగ్గర కలిసేందుకు పిలిచాడు.



నిందితుడ్ని తన రెండేళ్ల బిడ్డతో పాటు హాస్పిటల్ వద్ద కలిసింది మహిళ. ఆమెను మద బిల్డింగ్ వద్దకు తీసుకెళ్లాడు. ‘మహిళను రెండేళ్ల బిడ్డను వేరేగదిలోకి పంపాలని చెప్పాడు. ఆ తర్వాత ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని దాడి చేశాడు. ఒకవేళ డబ్బులు ఇవ్వలేకపోతే లైంగిక కోర్కెలు తీర్చాలని వేధించాడు’ అని పోలీస్ ఆఫీసర్ చెప్పారు.
https://10tv.in/bus-runs-over-pregnant-nurse/
లైంగికంగా ఆమెను వేధించి.. అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఫిజికల్ గా కూడా ఆమెపై దాడి చేసి కడుపుపై తన్నాడు. ఆమెకు అబార్షన్ అయి రక్తస్రావం అయిందని డాక్టర్లు కన్ఫామ్ చేశారు.

ఆ తర్వాత బాధితురాలు భర్తతో కలిసి.. వెర్సోవా పోలీసులను సంప్రదించి కంప్లైంట్ చేసింది. సెక్షన్స్ 376, 313, 323, 506 కింద కేసు ఫైల్ చేసిన వెర్సోవా పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు.