Cruise Drugs Case : షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్‌కు 2 వారాల జ్యుడీషియల్ కస్టడీ

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు ముంబయి కోర్టు రెండు వారాల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆర్యన్ ఖాన్ కు గురువారంతో ఎన్సీబీ కస్టడీ ముగియగా, మరో నాలుగు రోజులు

Cruise Drugs Case : షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్‌కు 2 వారాల జ్యుడీషియల్ కస్టడీ

Cruise Drugs Case

Cruise Drugs Case : బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు ముంబయి కోర్టు రెండు వారాల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆర్యన్ ఖాన్ కు గురువారంతో ఎన్సీబీ కస్టడీ ముగియగా, మరో నాలుగు రోజులు కస్టడీకీ అప్పగించాలని ఎన్సీబీ చేసుకున్న విజ్ఞప్తిని సిటీ కోర్టు తోసిపుచ్చింది. నిర్బంధ విచారణ అవసరం లేదంది.

Mukesh Ambani : ఇండియాకు 7-ఎలెవెన్ స్టోర్లు.. దేశంలో ఫస్ట్ స్టోర్ ఎక్కడంటే?

కాగా, ఆర్యన్ ఖాన్ కు 14 రోజుల కస్టడీ విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అక్కడే ఉన్న షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దడ్లానీ కంటతడి పెట్టారు. ఇక, ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై శుక్రవారం విచారణ జరగనుంది. బెయిల్ పై న్యాయమూర్తి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Facebook: ఫేస్‌బుక్‌ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు..!

క్రూయిజ్ నౌక డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో ఆర్యన్‌ సహా ఎనిమిది మంది నిందితులకు ముంబయి సిటీ కోర్టు జ్యుడీషియిల్‌ కస్టడీ విధించింది. జ్యుడీషియల్‌ కస్టడీ విధించిన నిమిషాల వ్యవధిలోనే ఆర్యన్‌ తరఫు న్యాయవాది సతీశ్‌ మానేశిందే మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. జైలుకి తరలించేందుకు కొవిడ్ నిబంధనల నేపథ్యంలో కొవిడ్ నెగెటివ్‌ సర్టిఫికెట్లు తప్పనిసరి కావడంతో ఆర్యన్‌ సహా మిగతా నిందితులను ఈ రాత్రికి ముంబయిలోని ఎన్సీబీ కార్యాలయంలోనే ఉంచనున్నారు. ఎన్సీబీ కార్యాలయానికి వారిని తరలించాక అక్కడ కుటుంబ సభ్యులు కలిసేందుకు న్యాయమూర్తి అనుమతించారు.

ముంబయి తీర ప్రాంతంలో ఇటీవల గోవాకు చెందిన క్రూజ్‌ నౌకలో రేవ్‌ పార్టీపై ఎన్సీబీ అధికారులు దాడులు జరిపారు. ఆర్యన్‌ ఖాన్‌, మూన్‌మూన్‌ ధామేచ, అర్బాజ్‌ మెర్చంట్‌ సహా 8మందిని అరెస్ట్ చేశారు.