Mumbai Doctor : వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా..ముంబై డాక్టర్ కి 3వ సారి కోవిడ్ పాజిటివ్

కోవిడ్ వ్యాక్సిన్ల సామర్ధ్యంపై ముఖ్యంగా వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త కోవిడ్ వేరియంట్లపై వ్యాక్సిన్ల ప్రభావం గురించి చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.

10TV Telugu News

Mumbai Doctor  కోవిడ్ వ్యాక్సిన్ల సామర్ధ్యంపై ముఖ్యంగా వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త కోవిడ్ వేరియంట్లపై వ్యాక్సిన్ల ప్రభావం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చర్చ జరుగుతున్న సమయంలోనే తాజాగా ముంబైకి చెందిన 26 ఏళ్ల ఓ మహిళా డాక్టర్ “శృష్టీ హలరీ”కి మూడవసారి కోవిడ్ పాజిటివ్ గా తేలింది. 13 నెలల్లో మూడు సార్లు శృష్టీ హలరీ కోవిడ్ సోకగా… రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నతర్వాత కూడా రెండవసారి కోవిడ్ సోకింది.

శృష్టీ హలరీ కుటంబసభ్యులు-తండ్రి,తల్లి,సోదరుడు కూడా కోవిడ్ బారిన పడ్డారు. అయితే వీరందరూ కోవిడ్ బారినపడటం ఇదే మొదటిసారి. కాగా వీరు కూడా రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారే.

కరోనా వైరస్ సోకిన శృష్టీ హలరీ కుటుంబమంతా హాస్పిటల్ లో చేరారు. శృష్టీ హలరీ మరియు ఆమె సోదరుడి శాంపిల్స్ ను తీసుకుని.. ఏ వేరియంట్ వల్ల వీరి కుటుంబానికి కోవిడ్ సోకిందనేది విషయాన్ని కనుగొనేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు.

కాగా,వృత్తీ రీత్యా ముంబైలోని ములుంద్ ఏరియాలోని వీర్ సావర్కర్ హాస్పిటల్ లో పనిచేసే శృష్టీ హలరీకీ మొదటిసారిగా గతేడాది జూన్-17న కోవిడ్ వైరస్ సోకింది. ఈ ఏడాది మార్చి-8న శృష్టీ హలరీ..కోవిడ్ వ్యాక్సిన్ మెదటి డోసు తీసుకుంది. ఏప్రిల్-29న వ్యాక్సిన్ రెండో డోసు తీసుకుంది. కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న నెల రోజుల తర్వాత మే-29న శృష్టీ హలరీకీ రెండోసారి కోవిడ్ పాజిటివ్ గా తేలింది. అయితే ఈ సారి కూడా పెద్దగా మహమ్మారి లక్షణాలు లేకపోవడంతో ఇంట్లే ఉండే కోవిడ్ నుంచి కోలుకోగలిగింది. అయితే జులై-11న డాక్టర్ హలరీకి మరోసారి కోవిడ్ సోకింది. ఈ సారి ఆమెతో పాటు నలుగురు కుబుంబసభ్యులందరికీ పాజిటివ్ గా తేలింది.

మూడవసారి కోవిడ్ సోకినప్పుడు తాను చాలా బాధపడ్డానని..తాను,తన కుటుంబమంతా హాస్పిటల్ లో చేరిందని మంగళవారం ఓ ఇంటర్వ్యూలో డాక్టర్ హలరీ తెలిపారు. తమకు రెమ్ డెసివర్ కూడా అవసరమైందని తెలిపారు. తన సోదరుడు,తల్లికి డయాబెటిస్ ఉందని,తన తండ్రికి హైపర్ టెన్షన్ ఉన్నట్లు హలరీ తెలిపారు. తన సోదరుడికి ఓ దశలో ఊపిరి సమస్యలు తలెత్తామని..రెండు రోజుల పాటు అతడిని ఆక్సిజన్ బెడ్ పైనే ఉంచినట్లు తెలిపారు. రక్తంలో కోవిడ్ యాంటీబాడీస్ కోసం చేసిన టెస్ట్ సానుకూల ఫలితాలను ఇచ్చిందని డాక్టర్ చెప్పారు.

10TV Telugu News