ముంబైలో మాల్‌కు భారీ అగ్నిప్రమాదం: 228 ట్యాంకర్లతో 250 మంది సిబ్బంది సహాయకచర్యలు

  • Published By: madhu ,Published On : October 25, 2020 / 01:44 PM IST
ముంబైలో మాల్‌కు భారీ అగ్నిప్రమాదం: 228 ట్యాంకర్లతో 250 మంది సిబ్బంది సహాయకచర్యలు

Mumbai Fire Accident : దక్షిణ ముంబైలోని సెంట్రల్ సిటీ సెంటర్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం చెలరేగిన మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఆదివారం ఉదయం మంటలు కంట్రోల్ కు వచ్చాయి. ఇంకా ఆపరేషన్ కొనసాగుతోంది. సుమారు 56 గంటల తర్వాత..ఆదివారం తెల్లవారుజామున 05.08 గంటలకు మంటలను ఆర్పామని Mumbai Fire Brigade (MFB) వెల్లడించింది.



Nagpada ప్రాంతంలో ఉన్న మాల్ లో 55 అంతస్తులున్నాయి. రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి. మాల్ భారీ విస్తీర్ణంలో ఉంది. ప్రతి అంతస్తులో 400 దుకాణాలున్నాయి. గురువారం రాత్రి 8.53 గంటలకు చిన్నగా మొదలైన మంటలు తర్వాత..విస్తరించాయని అగ్నిమాపక అధికారి తెలిపారు. ఇతర అంతస్తులకు వ్యాపించడంతో brigade call – level 5గా ముంబై అగ్నిమాపక దళం ప్రకటించింది.



మాల్ లో అనేక దుకాణాల్లో మొబైల్ ఫోన్లు, బ్యాటరీలు, ఛార్జర్లు, ఇతర ఎలక్ట్రిక్ వైర్లు, ఇతర మండే స్వభావం ఉన్న వస్తువులు ఉండడంతో మంటల తీవ్రత అధికంగా ఉందని అధికారి వెల్లడించారు. భారీ ఎత్తున చెలరేగుతున్న మంటలను ఆర్పడానికి 250 అగ్నిమాపక సిబ్బంది, 228 ట్యాంకర్లను మోహరించాయి.



మంటలు పై కప్పు నుంచి చెలరేగుతుండడంతో తాము తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని, మంటలు ఆర్పే సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడ్డారన్నారు. దీని కారణంగా..ఆరుగురు అగ్నిమాపక సిబ్బంది అస్వస్థతకు గురి కావడంతో వీరిని నాయర్ ఆసుపత్రికి తరలించారు. మాల్ లో అగ్ని ప్రమాదంలో జరిగితే..వెంటనే చర్యలు తీసుకోవడానికి తగిన ఏర్పాట్లు ఉన్నాయా ? లేదా ? అనే దానిపై పరిశీలిస్తామని MFB వెల్లడించింది. మంటలు తీవ్రస్థాయికి పెరుగుతున్న క్రమంలో..పొరుగున ఉన్న 3 వేల 500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.