ఇంట్లో ఉన్నట్లే :ఆటోలో మొక్కలు,వాటర్ ప్యూరి ఫై,వాష్ బేసిన్

  • Published By: veegamteam ,Published On : November 21, 2019 / 04:41 AM IST
ఇంట్లో ఉన్నట్లే :ఆటోలో మొక్కలు,వాటర్ ప్యూరి ఫై,వాష్ బేసిన్

గుంపులో గోవిందాలాగా ఉండటం కొంతమందికి ఇష్టం ఉండదు. నలుగురిలో ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు. తమకంటూ ఓ గుర్తింపును కోరుకుంటారు. సరిగ్గా అలాగే ఆలోచించాడు ఓ ఆటో వాలా. అందరి ఆటోల్లా తన ఆటో ఉండకూడదు..కాస్త డిఫరెంట్ గా ఉండాలనుకున్నాడు. తన ఆటో ఎక్కినవారు ఓ చక్కటి అనుభూతిని లోనవ్వాలని అనుకున్నాడు. దీంతో ఇది ఆటోనా? లేక ఇల్లా? అనేలా తయారు చేసేశా ముంబై ఆటో వాలా..మరి ఆ ఆటో విశేషమేంటో చూద్దాం..

అది ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే ముంబై మహానగరం. అక్కడ సత్యవాన్ గైట్ ఆటో నడుపుతుంటాడు. ముంబైలో సత్యవాన్ గైట్ ఆటోకు చాలా ప్రత్యేకత ఉంది. అదే ముంబైలోనే మొట్ట మొదటి ‘హోమ్ సిస్టమ్ ఆటో రిక్షా’.  సత్యవాన్ గైట్ ఆటో ఎక్కితే ఓ ఇంట్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే ఆటోని ఓ చిన్నసైజు ఇల్లులా మార్చేశాడు. 

ఇలా ఎందుకు అని అని సత్యవాన్ ను అడిగితే ఇలా అంటున్నాడు. ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించాలనుకుంటున్నాననీ..తన ఆటో ఎక్కితే తమ ఇంటిలో ఉన్న ఫీలింగ్ కలుగుతుందని అంటున్నాడు. ఆటోలో ఫోన్ చార్జింగ్ పెట్టుకోవచ్చు. చక్కగా శుద్ధి చేసిన వాటర్ తాగొచ్చు.ఆహ్లాదాన్ని కలిగించే మొక్కలతో చక్కగా గార్డెన్ లో కూర్చున్న ఫీలింగ్ కలుగుతుందంటున్నాడు. అంతేకాదు వాష్ బేసిన్..డెస్క్‌టాప్ మానిటర్ వంటి ఫెసిలిటీస్ ను కూడా అందిస్తున్నాడు ఈ ముంబై ఆటో వాలా. 
సత్యవాన్ గైట్ మరో ఆదర్శవంతమైన పని కూడా చేస్తున్నాడు. ముంబైలో 1 కిలో మీటర్ దూరం ప్రయాణించే సీనియర్ సిటిజన్స్ కు ఫ్రీగా తన ఆటో సర్వీసుని అందిస్తున్నాడు.