ఏడాది తర్వాత విరసం నేత వరవరరావుకు బెయిల్ మంజూరు

ఏడాది తర్వాత విరసం నేత వరవరరావుకు బెయిల్ మంజూరు

Bail granted to Varavararao : బీమా కోరేగావ్ కేసులో అరెస్టైన విరసం నేత వరవరరావుకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ముంబై హైకోర్ట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఏడాది తర్వాత బెయిల్ మంజూరు అయింది. బీమా కొరేగావ్ కేసులో వరవరరావుకు 6 నెలల బెయిల్ మంజూరు చేసింది.

గతేడాది మహారాష్ట్రలోని కోరెగావ్ కుట్ర కేసులో వరవరరావును ఎన్ఐఏ అరెస్టు చేసింది. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ముంబై కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

అయితే బెయిల్ మంజూరు చేసే సమయంలో కోర్టు షరతులు విధించింది. ఆరు నెలలపాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలని సూచించింది. అంతేకాకుండా ముంబై విడిచి ఎక్కడకు వెళ్లొద్దని తెలిపింది. వరవరరావు ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నారు.