2050 నాటికి మునిగిపోతాయి : ముంబై, కోల్‌కతాలకు పొంచి ఉన్న ముప్పు

2050 కల్లా ముంబై, కోల్‌కతా నగరాలు తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నాయని అమెరికాకు చెందిన క్లైమెట్‌ సెంట్రల్‌ అనే పర్యావరణ పరిశోధన సంస్థ హెచ్చరించింది. పెరుగుతున్న

  • Published By: veegamteam ,Published On : October 31, 2019 / 03:10 AM IST
2050 నాటికి మునిగిపోతాయి : ముంబై, కోల్‌కతాలకు పొంచి ఉన్న ముప్పు

2050 కల్లా ముంబై, కోల్‌కతా నగరాలు తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నాయని అమెరికాకు చెందిన క్లైమెట్‌ సెంట్రల్‌ అనే పర్యావరణ పరిశోధన సంస్థ హెచ్చరించింది. పెరుగుతున్న

2050 కల్లా ముంబై, కోల్‌కతా నగరాలు తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నాయని అమెరికాకు చెందిన క్లైమెట్‌ సెంట్రల్‌ అనే పర్యావరణ పరిశోధన సంస్థ హెచ్చరించింది. పెరుగుతున్న భూతాపంపై పరిశోధన చేస్తున్న ఆ సంస్థ..2050 కల్లా ముంబై, కోల్‌కతాలు ప్రమాదపు అంచున నిలుస్తాయని తెలిపింది. పెరుగుతున్న సముద్రమట్టాల కారణంగా ఈ నగరాలలోని అత్యధిక ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉందని వెల్లడించింది.

క్లైమెట్‌ సెంట్రల్‌ సంస్థ తన పరిశోధన వివరాలను నేచర్ కమ్యూనికేషన్ అనే జర్నల్‌లో ప్రచురించింది. పెరిగిపోతున్న కర్బన ఉద్గారాల కారణంగా భారత తీర ప్రాంతాలు వరద ముప్పును ఎదుర్కొంటున్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. కర్బన ఉద్గారాలను తగ్గించకపోతే ఈ ప్రమాదం సంభవిస్తుందని హెచ్చరించింది.

తొందరలోనే జల ప్రళయం రానుందని వాతావారణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూవాతావరణంలోకి వేడి పెంచే వాయువుల విడుదల వల్ల ఉష్ణోగ్రత పెరిగుతోంది. మంచుపర్వతాలు కరిగిపోతున్నాయి. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఇది ప్రళయానికి దారి తీస్తుందన్నారు. సముద్ర ఉష్ణోగ్రత పెరిగితే సముద్రం వ్యాకోచిస్తుంది. తీర ప్రాంతాల కంటే ఎత్తుకు సముద్రం మట్టం పెరుగుతుంది. ఆ ప్రాంతాలను ముంచేస్తుంది.

ప్రపంచ వ్యాప్తంగా తీర ప్రాంతాల్లో 30 కోట్ల మంది జీవిస్తున్నారు. ఇలా సముద్రం దాడి చేస్తే వచ్చే వరదల్లో తీర ప్రాంతాల‌న్నీ మున‌గ‌నున్నాయి. మహా నగరాలు నాశనమమవుతాయి. ఆరు ఆసియా దేశాల్లో సుమారు 200 మిలియన్లకు పైగా ప్రజలు వచ్చే 30 ఏళ్లలో వరదల బారిన పడబోతున్నారు. చైనా, బంగ్లాదేశ్, ఇండియా, వియత్నామ్, ఇండోనేషియా, థాయ్ లాండ్ లు దేశాలకు జల ప్రళయం ముప్పు పొంచి ఉంది.