కరోనా భయం : ఫేస్ షీల్డ్, మాస్క్‌తో డ్యూటీ చేస్తున్న మహిళా రైలు డ్రైవర్

  • Published By: madhu ,Published On : June 21, 2020 / 04:30 AM IST
కరోనా భయం : ఫేస్ షీల్డ్, మాస్క్‌తో డ్యూటీ చేస్తున్న మహిళా రైలు డ్రైవర్

భారతదేశంలో వాణిజ్య నగరంగా పేరొందిన ముంబాయిలో కరోనా ఉగ్రరూపం దాలుస్తున్నా..తనకు విధులు ముఖ్యమంటోంది ఓ మహిళా రైలు డ్రైవర్. కనీస జాగ్రత్తలు పాటిస్తూ..రైలు నడుపుతున్న ఫొటోలను రైల్వే శాఖ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతున్నాయి.

CSMT – Panvel లోకల్ ట్రైన్ ను నడిపారామె. ఆ ట్రైన్ లో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ఉద్యోగులున్నారు. మనిషా మాస్కే రైలు డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నారు. స్థానిక రైలులో ప్రయాణించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్యాసింజర్స్ కు సూచించింది సెంట్రల్ రైల్వే శాఖ. 

ముంబాయిలో కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుందో అందరికీ తెలిసిందే. కొద్ది రోజుల కిందట విధించిన లాక్ డౌన్ విషయంలో కొన్ని సడలింపులు ఇచ్చింది కేంద్రం. దీంతో రవాణా, ఇతర రంగాలు ఓపెన్ అయ్యాయి. అందులో ప్రజా రవాణా కీలకం. జూన్ 15వ తేదీ నుంచి అవసరమైన మేరకు రైళ్లు నడుస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన వారు మాత్రమే రైళ్లలో ప్రయాణిస్తారని, ప్రజలు స్టేషన్ లలో గుమికూడవద్దని సూచించింది. రైళ్లు ఉదయం 5.30 నుంచి రాత్రి 11.30 వరకు రాకపోకలు సాగిస్తాయని, Churchgate & Virar రైళ్లు తిరుగుతాయని, కొన్ని రైళ్లు Dahanu Road వరకు తిరుగుతాయన్నారు. వెస్ట్రన్ రైల్వేలో సుమారు 1.25 లక్షల మంది సిబ్బంది ప్రయాణించే వీలుందని అంచనా వేసింది.

జనరల్ ప్యాసింజర్స్ కోసం స్పెషల్ సబ్బర్బన్ సర్వీసులు ఉండవని, ప్రభుత్వం గుర్తించిన సిబ్బందిని మాత్రమే అనుమతినివ్వడం జరుగుతుందని వెల్లడించింది. ప్రస్తుతం రైలు నడుపుతున్న మనిషా మహిళా డ్రైవర్ అందరికీ స్పూర్తి అని తెలిపింది. 

 

 Read: INDIAలో కరోనా ఉగ్రరూపం..గంటకు ఎన్ని కేసులో తెలుసా