Cannabis Cakes : గంజాయితో కేకులు,పఫ్ లు తయారు చేస్తున్న బేకరీ..

ముంబైలో ఓ బేకరిలో గంజాయితో తయారు చేసి కేకులు విక్రయిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎన్‌సీబీ అధికారులు ఆ బేకరీపై రైడ్ చేశారు. 10 కేకులు స్వాధీనం చేసుకున్నారు.

Cannabis Cakes : గంజాయితో కేకులు,పఫ్ లు తయారు చేస్తున్న బేకరీ..

Mumbai cannabis based cakes : సాధారణంగా కేకులు పంచదార..మైదాతో పాటు టేస్ట్ కోసం పలు ఎస్సెన్స్ వేసి తయారు చేస్తారు. కానీ ముంబైలోని ఓ బేకరిలో మాత్రం వీటితో పాటు గంజాయి కూడా వేసి తయారు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎన్‌సీబీ అధికారులు ఆ బేకరీపై రైడ్ చేశారు. 10 కేకులు స్వాధీనం చేసుకున్నారు.అనంతరం బేకరీకి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ముంబైలోని మాలాడ్‌ ప్రాంతంలోని ఓ బేకరీలో గంజాయి, మారిజువానా వంటి మత్తుపదార్థాలు వేసి కేకులు తయారు చేసి అమ్ముతున్నారు.గుట్టు చప్పుడు కూడా కాకుండా గంజాయిని కేకులు..పఫ్‌ల రూపంలో పెట్టి మరీ అమ్మేస్తున్నారు. కానీ ఎంతోకాలం నడవవు కదూ..ఇటువంటి పనులు..ఈ క్రమంలో సదరు బేకరీపై ‘నార్కొటిక్స్ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ)’ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి 10 కేకుల్ని స్వాధీనం చేసుకున్నారు. బేకరీకి చెందిన ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.ఎంత కాలం నుంచి ఇటువంటి వ్యాపారం చేస్తున్నారు? ఈ గంజాయిని ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు? దీని వెనుక ఎవరెవరు ఉన్నారు? అనే అంశాలపై విచారణ కొనసాగిస్తున్నారు.

గంజాయితో కేకులు తయారీ గురించి ముంబయి ‘నార్కొటిక్స్ కంట్రోల్‌ బ్యూరో అధికారులు మాట్లాడుతూ..బేకరీలో గంజాయితో తయారు కేకులు తయారు చేస్తున్నారనే పక్కా సమాచారంతో బేకరీలో తనిఖీలు నిర్వహించామనీ..అటువంటి 10 కేకులు దొరికాయని తెలిపారు. దేశంలో ఇటువంటిది మొదటిసారి అయిన తెలిపారు.

కేకులు 830 గ్రాములు బరువున్నాయన్నాయని తెలిపారు. 10 కేకులతో పాటు 35 గ్రాముల మారిజువానాను కూడా స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. వీరిలో ఓ వ్యక్తి దగ్గర మరో 125 గ్రాముల మారిజువానా ఉన్నట్లు గుర్తంచిన అధికారులు దాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. కాగా..గంజాయిని పొగ ద్వారా తీసుకోవడం కంటే ఆహార పదార్థంగా మార్చి తింటే ప్రభావం శరీరంపై ఎక్కువ సమయం ఉంటుందని వెల్లడించారు. అలాగే గంజాయితో తయారు చేసిన ఫుడ్ ఐటెమ్స్ ను గుర్తించటం చాలా కష్టమని తెలిపారు.