Rs.1 Lakh Paan : ఈ పాన్ ధర అక్షరాలా లక్ష రూపాయలు..!!

అక్షరాలా లక్ష రూపాయలు ఖరీదు చేసే ఓ పాన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ పాన్ వాలా తయారు చేసిన ఈ లక్ష రూాపాయల పాన్ ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ ఆకారంలో అలరిస్తోంది.

Rs.1 Lakh Paan : ఈ పాన్ ధర అక్షరాలా లక్ష రూపాయలు..!!

Paan Price Is Rs.1 Lakh

Paan price is Rs.1 Lakh : పాన్. దీన్నే సంప్రదాయంగా తాంబూలం అంటాం. దీన్నే కిళ్లీ అని కూడా అంటాం. కానీ షాపుల్లో విక్రయించే పాన్ లలో ఎన్నో రకాలు. దేని రుచి దానిదే. దేని ప్రత్యేకత దానిదే. అలా పాన్ ల్లో ఎన్నో రకాలున్నాయి. వీటి ధరలు కూడా దానికి తగినట్లే ఉంటాయి. సాధారణం పాన్ ఓ రూ.50లు ఉంటుందేమో. మహా అయితే రూ.100 లేదా రూ.200లు అనుకుందాం. కానీ..ముంబయిలోని ఓ షాపులో లభించే ఓ పాన్‌ ధర మాత్రం అక్షరాలా లక్ష రూపాయలు..! ఏంటీ ఒక్క పాన్ ధర రూ.లక్షా..!! అని ఆశ్చర్యపోతున్నారా? అదే మరి దాని ప్రత్యేకత..

ముంబయిలోని మాహిమ్​ ప్రాంతంలో నౌషాద్‌ అనే వ్యక్తి ఎంఎన్‌సీలో ఉద్యోగాన్ని వదిలి ‘ది పాన్‌ స్టోరీ’ పేరుతో పాన్ షాపు నిర్వహిస్తున్నారు. వివిధ రకాల రుచుల్లో పాన్‌లను తయారు చేసి విక్రయిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు.ఆయన పాన్ కు మంచి పేరుంది ముంబైలో.పాన్ తినాలంటే నౌషాద్ భయ్యా చేతిపానే తినాలంటారు పాన్ ప్రియులు.ఈక్రమంలో నౌషాద్ తనదైన స్టైల్ లో ఓ పాన్ తయారు చేశారు. దానికి ‘తాజ్‌మహల్‌ పాన్‌’ అని పేరు పెట్టారు. ప్రేమకు ప్రతీకైన తాజ్‌మహల్‌కు తన స్పెషల్‌ పాన్‌ను జోడిస్తే ఆ అనుభూతే వేరు అంటున్నారు నౌషాద్‌. ప్రేమకుక చిహ్నమైన తాజ్ మహల్ పాన్ ను ఎవరికైనా గిఫ్టుగా ఇస్తే జీవితాంతం గుర్తుండిపోయేలా ఉండేలా దీన్ని తయారు చేసానని తెలిపారు నౌషాద్.

Read more : Rs 1 Crore Bull : ఒక్క ఎద్దు ధర రూ. కోటి.. అందుకే అంత డిమాండ్

నౌషాద్ ‘ప్రేమ పరిమళం’ పేరుతో..ఓ ప్రత్యేక పాన్​ను నౌషాద్ విక్రయించేవారు. అందులో రెండు అత్తరు సీసాలను కానుకగా ఇచ్చేవాడు. అయితే కస్టమర్లు ఇంకా ఎక్కువ రకాలు సెంట్లు ఉంటే బాగుంటుందని చెప్పారు. తాను తయారు చేసిన ప్రత్యేక పాన్​తో తాజ్​మహల్​ను ​ ఇవ్వాలని నిర్ణయించాడు. దీనికి ఉండే ఐదు గోపురాల నుంచి ఐదు రకాల అత్తరు సువాసనలు వెదజల్లేలా సీసాలను అమర్చాడు. అంతేకాదు ఆ గోపురాలకు పేర్లు కూడా పెట్టారు నౌషాద్.ఇలాంటి ప్రీమియం పాన్​లను విక్రయించడం నౌషాద్​కు కొత్తేం కాదు. నౌషాద్​ షాపులో రూ.35 నుంచి రూ. లక్ష విలువ చేసే పాన్​లు అనేక రకాలు లభిస్తాయి.

మల్టీనేషనల్​ కంపెనీలో ఉద్యోగం వదులుకొని ఈ పాన్​ షాప్​ పెట్టిన నౌషాద్​.. అతితక్కువ కాలంలోనే తన వ్యాపారానికి ఓ గుర్తింపు తెచ్చారు. లాభాలబాట పట్టించారు. వివిధ రకాల పాన్​లను విక్రయిస్తూ కస్టమర్లను ఆకట్టుకునే నౌషాద్​.. తాజాగా ఈ తాజ్ మహల్ పాన్ తో మరింత ఆకర్షణగా నిలుస్తున్నారు.

Read more : Bbaahubali Bull :ఈ బాహుబలి దున్న‌పోతు వెరీ రిచ్..ప్రీమియం స్కాచ్, సండే స్విమ్మింగ్,కిలోల కొద్దీ డ్రైఫ్రూట్..

కాగా..పాన్..​ భారత సంస్కృతిలో ఓ భాగం అని చెప్పాలి. సంప్రదాయబద్దంగా పాన్ ను తాంబూలం అని అంటాం. భోజనం అయ్యాక తాంబూలం వేసుకోవటం మన పూర్వికుల సంప్రదాయం.అదే తాంబూలం షాపుల్లో ఎన్ని రకాలుగా దొరుకుతోంది. దాన్ని పాన్ అంటాం. తమలపాకు,సున్నం, వక్క కలిపిన దాన్ని తాంబూలం అంటాం. అదే పాన్ అయితే దాంట్లో ఇంకా సుగంధ ద్రవ్యాలు కలుపుతారు. పాన్ లో వందల రకాలున్నాయి. మన హైదరాబాద్ లో కూడా పలు ఫ్లేవర్లలో పాన్ లు అమ్ముతుంటారు. ఆ షాపుల్లో పాన్ తినటానికి ఎంతో దూరాల నుంచి వస్తారంటే వాటింకుండే క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు..

150 రకాల పాన్ ల అడ్డా..’ది పాన్​ స్టూడియో’..
పాన్ లలో ఎన్నో ఫ్లేవర్లు ఉన్నాయి. కర్ణాటకకు చెందిన ‘ది పాన్​ స్టూడియో’.కర్ణాటక బెంగళూరులోని ఫ్రేజర్ టౌన్​ ప్రాంతానికి చెందిన మతీన్ సయ్యద్ ఖలీల్ సోదరులు తయారు చేసే 150 రకాల పాన్​ రుచులకు ఏకైక అడ్డా’ది పాన్​ స్టూడియో’.. పాన్​ ప్రియులకు ఓ ప్రత్యేకమైన అనుభూతి అందించడానికి మతీన్ సయ్యద్ ఖలీల్ సోదరుల దీనిని ప్రారంభించారు.

150 రకాల కిళ్లీలుఈ కేఫ్​లో లభించని కిళ్లీ​ ఉండదని చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా ఉండే రకరకాల పాన్​ ఫ్లేవర్లను ఇక్కడ రుచి చూడవచ్చు. పాన్​, పాన్​ చాక్లెట్స్​, పాన్​ ఫ్లేవర్డ్​ డ్రై ఫ్రూట్స్​, నేచురల్​ టీ వంటి 150 రకాల పాన్​ ఫ్లేవర్లు ‘పాన్​ స్టూడియో’లో లభిస్తాయి. వీటిలో 50 సాదా కిళ్లీలు కాగా.. మరో 100 ఇతర సహజ ఫ్లేవర్లు.. టోబ్లెరోన్​, చాక్లెట్​, కాఫీ, కేసరి, పుదీనా వంటి మరెన్నో ఉన్నాయి. ఫ్లేవర్ ఆధారంగా ఒక్కో కిళ్లీ​ ధర రూ.50 నుంచి రూ.150 వరకు ఉంటుంది. కానీ నౌషాద్ గారి ‘తాజ్ మహల్ పాన్’మాత్రం అక్షరాలా లక్ష రూపాయలు..మరి అంతేగా..ప్రేమ పరిమళంతో పాటు ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ రూపంలో పాన్..మరి ధర కూడా దానికి తగ్గట్లే ఉందిగా..