ముంబైలో ఒంటరి మహిళను రక్షించిన కుక్క

  • Published By: vamsi ,Published On : October 30, 2020 / 08:08 AM IST
ముంబైలో ఒంటరి మహిళను రక్షించిన కుక్క

mumbai pet dog:సమాజం మారిపోయింది.. ఇరుగుపొరుగు వారిని కూడా నమ్మలేని స్థితిలోకి, సొంత బంధువులపై కూడా నమ్మకం ఉంచలేని పరిస్థితిలోకి ప్రపంచం వచ్చేసింది. సాటి మనిషినే కాదు, సొంత మనుషులను కూడా నమ్మలేని ఆధునిక సమాజంలో కుక్క చూపించే విశ్వాసం మాత్రం వేరు. మనిషి మచ్చిక చేసుకున్న జంతువుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచే కుక్క ఇప్పటికే పలు సంధర్భాల్లో తనకున్న ప్రత్యేకత చాటుకుంది.



ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా ఓ కుక్కు ఓ ఒంటరి మహిళను పెద్ద ప్రమాదం నుంచి కాపాడింది. ముంబై నగరంలో 33ఏళ్ల ఓ వితంతువు, తన ఏడేళ్ల కుమార్తెతో ముంబైలోని పోవై పరిసరాల్లో అద్దె వసతి గృహంలో నివసిస్తోంది. తెల్లవారుజామున ఓ దుండగుడు ఇంట్లోకి ప్రవేశించగానే మహిళ తన పెంపుడు కుక్క కారణంగా లైంగిక వేధింపులకు గురికాకుండా కాపాడబడింది. మహిళ ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేయగా.. సదరు నిందితుడిని సదర్ ఆలం(25) గా గుర్తించారు.



సదర్ ఆలం గత కొన్ని రోజులుగా మహిళకు ఆకర్షితుడై ఆమెను వేదిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే మహిళ ఇంట్లోకి తెల్లవారుజామున 3:45 గంటల సమయంలో ప్రవేశించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

అయితే షర్ట్ లేకుండా వ్యక్తి రావడం గమనించిన కుక్క వెంటనే పెద్దగా అరవడంతో.. చుట్టుపక్కల వాళ్లు లేవగా అతను పాయిపోయాడు. ఆ తర్వాత, ఆమె పోలీసులకు డయల్ చేసింది, నిందితునిపై భారతీయ శిక్షాస్మృతిలోని 354(డి) మరియు 452 సెక్షన్‌ల కింద దొంగతనం మరియు అక్రమ ప్రవేశం కేసులు నమోదయ్యాయి.