పోలీసుల హెచ్చరిక: ప్రమాదకరమైన సెల్ఫీలు అవసరమా

పోలీసుల హెచ్చరిక: ప్రమాదకరమైన సెల్ఫీలు అవసరమా

సెల్పీ తీసుకోవడానికి అమితంగా ఇష్టపడుతున్న యూత్‌కు ముంబై పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. చావు అంచున నిలబడి సెల్ఫీలు దిగడంపై ప్రశ్నిస్తూ.. ఓ ప్రమాదకరమైన సెల్ఫీ వీడియో పోస్టు చేశారు. 

బిల్డింగ్ అంచున నిలబడి సెల్ఫీ తీసుకుంటుంటే గురుత్వాకర్షణ శక్తి డబుల్ అయింది. బిల్డింగ్ అంచులు కూలిపోవడంతో ఒక్కసారిగా నేలకూలిపోయాడు. ఈ వీడియోను పోస్టు చేసిన ముంబై పోలీసులు ప్రాణం పోతే తిరిగిరాదని ఇలాంటి సాహసాలకు ఒడిగట్టి బలికావద్దని సూచించారు. 

ప్రపంచవ్యాప్తంగా 259మంది సెల్ఫీలు తీసుకుంటూననే మరణించారని ప్రముఖ ఇంగ్లీష్ మీడియా తెలిపింది. న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రీసెర్చర్స్ పరిశోధనల ప్రకారం.. సెల్ఫీ మరణాలు అక్టోబర్ 2011 నుంచి నవంబరు 2017లు ఎక్కువైయ్యాయట. 

2011 నుంచి ప్రపంచంలో సెల్ఫీ కారణంగా చనిపోయిన వారిలో భారత్ నుంచి సగానికి పైగా మనుషులు అంటే 159 వరకూ ప్రాణాలు కోల్పోయారట. ఈ క్రమంలోనే ముంబై పోలీసులు సెల్పీ తీసుకుంటున్న యువకుడు అదుపుతప్పి నేలమీద పడిపోయిన వీడియోను ట్వీట్ చేసి ఇలా రాసుకొచ్చారు. ‘చాలా ధైర్యవంతమైన సెల్ఫీ తీసుకుందామనుకున్నాడో… బాధ్యతారహితంగా ఫీట్ చేద్దామనుకున్నాడో.. ఏదీ ఏమైనా కానీ, ఈ ఫీట్ అతని ప్రాణాలు కోల్పోయేలా చేసింది’ అని ట్వీట్ చేశారు.