Mumbai : తడిసి ముద్దయిన ముంబాయి, నీట మునిగిన రోడ్లు

నైరుతి రుతుపవనాల ఆగమనంతో దేశ వాణిజ్య రాజధాని ముంబయి భారీ వర్షంతో తడిసిముద్దయింది. రుతుపవనాలు మహారాష్ట్రను తాకినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ముంబయి సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 2021, జులై 09వ తేదీ మంగళవారం రాత్రి నుంచే కుండపోత కురుస్తోంది. వర్షం కారణంగా నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Mumbai : తడిసి ముద్దయిన ముంబాయి, నీట మునిగిన రోడ్లు

Mumbai

Mumbai Rains : నైరుతి రుతుపవనాల ఆగమనంతో దేశ వాణిజ్య రాజధాని ముంబయి భారీ వర్షంతో తడిసిముద్దయింది. రుతుపవనాలు మహారాష్ట్రను తాకినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ముంబయి సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 2021, జులై 09వ తేదీ మంగళవారం రాత్రి నుంచే కుండపోత కురుస్తోంది. వర్షం కారణంగా నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వీధులు నదులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లు నీటమునిగాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో లోకల్‌ రైళ్లను నిలిపివేశారు.

రాత్రి 8 గంటల నుంచి ఈ ఉదయం 6 గంటల వరకు ముంబయిలో కొలాబాలో అత్యధికంగా 65.4 మిల్లీమీటర్లు, శాంతాక్రూజ్‌లో 50.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మరో ఐదు రోజుల పాటు ముంబయి, శివారు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ అంచనా వేసింది. థానే, రాయ్‌గఢ్‌, పుణె, బీడ్‌, పాల్ఘర్, నాసిక్‌ తదితర జిల్లాల్లోనూ వర్షాలు పడుతాయని తెలిపింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
సాధారణంగా ప్రతి సంవత్సరం జూన్‌ 10న నైరుతి రుతుపవనాలు ముంబయిని తాకుతాయి. అయితే ఈ ఏడాది ఒక రోజు ముందే వచ్చినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, బెంగాల్‌లో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు అంచనా వేశారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో నిన్నటి నుంచి పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.

ముంబైలో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాలను భారీ వాన ముంచెత్తుతోంది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు రైల్వే ట్రాక్‌లు నీటమునిగాయి. వచ్చే 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. భారీ వర్షాలతో కొంకణ్‌ తీర ప్రాంతాలు వణికిపోతున్నాయి. ముంబైలో భారీ వర్షాలు కురిసిన‌ప్పుడ‌ల్లా నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో మోకాళ్లలోతు వరకు నీరు నిలిచిపోయి ప‌లు స‌మ‌స్యలు త‌లెత్తుతుంటాయి.

Read More : Delhi hospital: ఏ మతాన్నో.. భాషనో కించపరచాలని అనుకోలేదు – ఢిల్లీ హాస్పిటల్