పది రూపాయలు ఎక్కువ బిల్లు వేసిందని రెస్టారెంట్‌కు రూ.2లక్షలు ఫైన్

పది రూపాయలు ఎక్కువ బిల్లు వేసిందని రెస్టారెంట్‌కు రూ.2లక్షలు ఫైన్

పది రూపాయలు ఎక్కువ బిల్లు వేసిందని రెస్టారెంట్‌కు రూ.2లక్షలు ఫైన్ వేశారు. ఎనిమిది సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘటనకు రీసెంట్ గా ఫైన్ వేశారు. 2014 జూన్‌లో పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ భాస్కర్ జాదవ్ (పీఎస్ఐ)కు ఇంటి దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది. వాళ్ల కూతురు ఐస్ క్రీమ్ కావాలంటూ అడిగింది. ముంబై సెంట్రల్ లో ఉన్న షాగున్ వెజ్ రెస్టారెంట్ కు వెళ్లి ఒన్ ఆన్ ఒన్ ఐస్ క్రీమ్ ప్యాక్ తీసుకున్నాడు.



700మిల్లీ లీటర్ల ఐస్ క్రీమ్ కు రూ.175 వసూలు చేశారు. కూలింగ్ ఛార్జెస్ కింద రూ.10అదనంగా తీసుకుంటున్నానని అమ్మే వ్యక్తి చెప్పాడు. ఆ ప్రొడక్ట్ నచ్చలేదని తిరిగి ఇవ్వడానికి ప్రయత్నిస్తే ఆ డబ్బులు తిరిగి ఇవ్వడానికి కూడా నిరాకరించాడు.
https://10tv.in/bigg-boss-season-4-ready-to-start/
వినియోగదారుల హక్కులపై అవగాహన ఉన్న జాదవ్.. డిస్ట్రిక్ట్ కమిషనర్ డిస్ప్యూట్స్ రెడ్రస్ ఫామ్ లో కంప్లైంట్ చేశాడు. యాక్టివిస్ట్ ప్రకాశ్ సేథ్ సాయంతో కేసు వాదనకు వచ్చింది. ఐదేళ్ల తర్వాత ఫారం రెస్టారెంట్ ను 45రోజుల్లోగా రూ.2లక్షలు చెల్లించాలని ఆర్డర్ చేసింది.



దాంతో పాటు ఫారం అదనంగా తీసుకున్న రూ.10సొమ్మును తిరిగి చెల్లించాలని ఆదేశించింది. వడాలా టీటీ పోలీస్ స్టేషన్ వద్ద అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సమక్షంలో ఇది జరగాలని చెప్పింది.

జాదవ్ ప్రధాన అటెన్షన్ ఏమంటే..దీనిపై ప్రజలందరికీ అవగాహన రావాలని. అదనంగా రూ.10 వసూలు చేసినదానికి శిక్షగా రూ.2లక్షలు చెల్లించాలని ఆదేశాలివ్వడంతో అతను సంతోషం వ్యక్తం చేశాడు. మిగిలిన ఫుడ్ సెంటర్లు అదనంగా ఛార్జిలు వసూలు చేయకూడదని అతను అంటున్నాడు.