ఎట్టకేలకు Covid వ్యాప్తిపై ముంబై పట్టు సాధించింది

  • Published By: Subhan ,Published On : June 12, 2020 / 09:34 AM IST
ఎట్టకేలకు Covid వ్యాప్తిపై ముంబై పట్టు సాధించింది

భారత ఆర్థిక రాజధాని ముంబై Covid వ్యాప్తిపై పట్టు సాధించింది. వైరల్ ఇన్ఫెక్షన్ ఇతరులకు సోకకుండా.. రెట్టింపు సంఖ్యలో నమోదైన కేసులు క్రమంగా తగ్గిపోయేలా చేసింది. ప్రత్యేకంగా బస్తీలపైనే ఫోకస్ పెట్టిన అధికారులు 23 రోజుల్లోనే సాధించేశారు. లాక్‌డౌన్ మొదలైన నాటి నుంచి మే 23వరకూ ముంబైలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. 

బృహ్మణ్ముంబాయ్ మునిసిపల్ కార్పొరేషన్లో నమోదైన కేసులు రెట్టింపు అయ్యాయి. ముంబై సిటీలో దాదాపు పీక్ రేంజ్ లో ఇన్ఫెక్షన్ నమోదైంది. సోషల్ డిస్టెన్స్, సేఫ్ గార్డ్స్ వంటివి వాడి వైరస్ ఫ్రీగా ఉండే ప్రయత్నం చేస్తుంది. ‘ఇవే ఫార్ములాలు వాడి సేఫ్ గార్డ్స్, మాస్క్‌లు, సోషల్ డిస్టెన్సింగ్ పాటించి జూన్ నెలాఖరుకు కంట్రోల్ చేయగలం. లేదంటే ఇన్ఫెక్షన్ మరో టర్న్ తీసుకోనున్నాయి’ అని అధికార ప్రతినిధి వెల్లడించారు. 

మొదట్లో నమోదైన కేసుల కంటే రెట్టింపుగా మరింత వేగవంతం అవుతున్నాయి. బృహ్మన్‌ముంబై మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు మే 23 తర్వాత ఇన్ఫెక్షెన్లు పీక్ కు చేరాయని.. 10రోజుల్లో లేదా అంతకంటే తక్కువ సంఖ్యలో అంటే 24వార్డుల్లో 14వార్డులకు కేసులు పెరిగాయంటున్నారు. 

ఘాట్‌కొపర్, మలాద్, గోరెగావ్, భాందప్ ప్రాంతాల్లో ఏడు రోజుల్లోనే రెట్టింపు నమోదయ్యాయి. జూన్ 8 నాటికి పరిస్థితి ఇంప్రూవ్  అయింది. ఘాట్‌కొపర్ ప్రాంతంలో 19రోజుల్లోనే రెట్టింపు అయ్యాయి. గోరెగావ్ సౌత్ వార్డులో 17రోజుల్లోనే రెట్టింపు కేసులు ఫైల్ అయ్యాయి. సిటీలోనే 3వేల 500కేసులు నమోదైనప్పటికీ సామాజిక దూరం, సేఫ్ గార్డ్స్ వంటి జాగ్రత్త చర్యలు తీసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. 

Read: ముఖేశ్ అంబానీ 13 బిలియన్ డాలర్ల డీల్ వెనుక ఉన్న ఆ రెయిన్ మేకర్ ఇతడే?