Aryan Khan : ఆర్యన్‌కు బెయిల్ ఇవ్వని కోర్టు.. హైకోర్టుకు బాద్ షా!

ముంబై తీరంలో బోట్ పార్టీ చేసుకుంటూ డ్రగ్స్ వినియోగిస్తూ సెలబ్రిటీలు దొరికిపోయిన కేసును నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో సీరియస్ గా తీసుకుంది.

Aryan Khan : ఆర్యన్‌కు బెయిల్ ఇవ్వని కోర్టు.. హైకోర్టుకు బాద్ షా!

Shahrukh Khan Aryan Khan

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు డ్రగ్స్ కేసులో చిక్కులు తప్పడం లేదు. బెయిల్ కోసం ఆర్యన్ చేస్తున్న ప్రయత్నాలు మరోసారి నిరాశనే మిగిల్చాయి. ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ ను ముంబై సెషన్స్ కోర్టు తిరస్కరించింది.

Samantha : 3 యూట్యూబ్ ఛానెళ్లపై సమంత పరువు నష్టం దావా

ముంబై తీరంలో బోట్ పార్టీ చేసుకుంటూ డ్రగ్స్ వినియోగిస్తూ సెలబ్రిటీలు దొరికిపోయిన కేసును నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో సీరియస్ గా తీసుకుంది. క్రూయిజ్ నౌక డ్రగ్స్ కేసులో అక్టోబర్ 2న ఆర్యన్ ఖాన్ ను ఎన్సీబీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులకు బెయిల్ ఇస్తే… ఆధారాలు తారుమారు చేస్తారని… బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరుతోంది ఎన్సీబీ. బాలీవుడ్ డ్రగ్స్ డొంకను మరింతగా కదిలించేందుకు తమకు సమయం పడుతుందని.. అప్పటివరకు నిందితులను తమ కస్టడీలోనే ఉంచాలని.. బెయిల్ ఇవ్వొద్దని ఎన్సీబీ కోర్టును కోరుతూ వస్తోంది. దీంతో… ఆర్యన్ ఖాన్ వేసిన బెయిల్ పిటిషన్ ను మరోసారి పరిగణనలోకి తీసుకోలేదు కోర్టు.

వరుసగా బెయిల్ పిటిషన్ ను ముంబై సెషన్స్ కోర్టు తిరస్కరిస్తుండటంతో… బాద్ షా మరో స్టెప్ తీసుకోవాలని డిసైడయ్యాడు. కొడుకు ఆర్యన్ ఖాన్ తరఫున ముంబై హైకోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్ధమయ్యాడు.

WhatsApp : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్..కాల్ కట్ అయినా సులభంగా జాయిన్ కావొచ్చు

ఈ కేసులో తర్వాతి వాదనలు కోర్టులో జరిగే వరకు… ఆర్థర్ రోడ్డులోని జైలులోనే ఉండనున్నాడు ఆర్యన్ ఖాన్. అవసరమైనప్పుడు… కోర్టు పర్మిషన్ తో జైలు నుంచి ఆర్యన్ ఖాన్ ను తమ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనున్నారు పోలీసులు. మరింత వివరాలు రాబట్టాల్సి ఉన్నందున… ఆర్యన్ ఖాన్ సహా.. ఇతర నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని ఇప్పటికే ముంబై ప్రత్యేక కోర్టులో వాదనలు వినిపించారు ఎన్సీబీ ఆఫీసర్లు.