మైండ్ బ్లాంక్ అయ్యింది విని : రాజా రామ్మోహన్ రాయ్ గెటప్‌లో కాలేజీ యూనిఫామ్

మైండ్ బ్లాంక్ అయ్యింది విని : రాజా రామ్మోహన్ రాయ్ గెటప్‌లో కాలేజీ యూనిఫామ్

కొన్ని కాలేజీల్లో మాత్రమే డిగ్రీ పూర్తి చేసిన వ్యక్తులకు తలపై టోపీ పెట్టి సత్కరించి పట్టాలు అందజేస్తారు. వాళ్లకు అదొక మధుర జ్ఞాపకంగా నిలిచపోతుంది. ముంబై యూనివర్సిటీ ఇటీవల ఇలాంటి పనే ఒకటి చేసింది. కాకపోతే విద్యార్థులకే కాకుండా ప్రొఫెసర్లకు కూడా యూనిఫామ్ ఉండాలని సర్కూలర్ రిలీజ్ చేసింది. 

శివకాలీన్ అంగ్రాఖాతో పాటు ఎర్ర తలపాగా కట్టుకోవాలని డ్రెస్ కోడ్ విధించింది. ఈ డ్రెస్ కు ఓ చరిత్ర ఉంది. మరాఠీ యుద్ధ వీరుడు శివాజీ బోన్‌స్లే వాడింది. ఈ అంగ్రాఖా(టాప్ డ్రెస్)కు అర్థం ఉంది. దీనిలో పైన ఉన్న ఫైఠానీ బోర్డర్ కమిట్‌మెంట్‌ను, మంచి నియమపాలనను సూచిస్తుంది. దీనికి సంబంధించిన ఫొటోలను యూనివర్సిటీ అధికారికంగా విడుదల చేసింది.

మేల్ స్టూడెంట్స్‌కు సాదా పైజామాలు, ఫిమేల్ స్టూడెంట్లు చీరలు లేదా సల్వార్ కమీజ్ లు దుప్పటితో పాటు కట్టుకోవాలని ప్రకటించింది. కొద్ది సేపటిలోనే అవి వైరల్ గా మారాయి. ప్రొఫెసర్ల డ్రెస్ పై రాజా రామ్మోహన్ రాయ్ గెటప్ అని కొందరు, మరికొందరు బాజీరావు సినిమాలో రణవీర్ సింగ్ డ్రెస్ లా ఉందంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇంకొందరేమో అరటి ఆకుల మీద సర్టిఫికేట్లు, చేతిలో ఖడ్గం పెట్టి రాజ్యాభిషేకం చేయాల్సిందని కామెంట్ చేస్తున్నారు.