Mumbai: ముంబైలో మ‌ళ్లీ క‌రోనా విజృంభ‌ణ‌

క‌రోనా ప‌రీక్ష‌ల సంఖ్య‌ను ప్ర‌భుత్వం పెంచింది. ముంబైలో పాజిటివిటీ రేటు 6 శాతానికి చేరిందని బృహాన్ ముంబై మునిసిప‌ల్ కార్పొరేషన్ (బీఎంసీ) బుధ‌వారం తెలిపింది.

Mumbai: ముంబైలో మ‌ళ్లీ క‌రోనా విజృంభ‌ణ‌

Mumbai: మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలో గ‌తంలో క‌రోనా ఎంత‌గా విజృంభించిందో ప్ర‌త్యేకంగా చెప్పే అవ‌స‌రం లేదు. ఇప్పుడు ముంబైలో మ‌ళ్లీ క‌రోనా కేసులు పెరిగిపోతున్నాయి. క‌రోనా ప‌రీక్ష‌ల సంఖ్య‌ను ప్ర‌భుత్వం పెంచింది. ముంబైలో పాజిటివిటీ రేటు 6 శాతానికి చేరిందని బృహాన్ ముంబై మునిసిప‌ల్ కార్పొరేషన్ (బీఎంసీ) బుధ‌వారం తెలిపింది. 12-18 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న వారికి వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను మ‌రింత వేగవంతం చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని బీఎంసీ కోరింది.

Congress: న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో సోనియా, రాహుల్‌కు స‌మ‌న్లు

అలాగే, అర్హులైన అంద‌రికీ బూస్ట‌ర్ డోసు ఇవ్వాల‌ని చెప్పింది. కేసుల సంఖ్య మ‌ళ్లీ భారీగా పెరిగే అవ‌కాశం ఉంద‌ని, క‌రోనా బాధితుల‌కు చికిత్స అందించేందుకు ఆసుప‌త్రులు త‌గినంత‌మంది వైద్య సిబ్బందిని అందుబాటులో ఉండ‌చుకోవ‌డ‌ంతో పాటు అన్ని ర‌కాల ఏర్పాట్లు చేసుకోవాల‌ని బీఎంసీ కోరింది. కాగా, ముంబైలో మంగ‌ళ‌వారం 506 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 6న 536 కేసులు న‌మోద‌య్యాయి. ఆ త‌ర్వాత క‌రోనా కేసులు మ‌ళ్లీ ఈ స్థాయిలో పెర‌గ‌డం ఇదే తొలిసారి. ముంబైలో ఏప్రిల్‌లో న‌మోదైన కేసుల కంటే మేలో 100 శాతం కేసులు అధికంగా న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం.