Kg Mangalsutra Gift : భార్యకు కిలో బంగారు తాళి గిఫ్ట్ ఇచ్చిన భర్త..అసలు విషయం తెలిసి పోలీసులు షాక్

మహారాష్ట్రలోని బివాండీకి చెందిన ఓ వ్యక్తి తన భార్యకు ఎవ్వరూ ఊహించనికానుక ఇచ్చాడు. ఎవరన్నా ఓ మూడు నాలుగు తులాలు తాళి చేయించి ఇస్తారు. కానీ బివాండీకి చెందిన బాలా అనే వ్యక్తి మాత్రం తన భార్యకు ఏకంగా కిలో అంటే 1000 గ్రాముల బరువున్న బంగారు తాళిని తమ పెళ్లిరోజు సందర్భంగా.. బహుమతిగా ఇచ్చాడు. దీంతో పోలీసులు పిలిచి విచారించేసరికి అతను చెప్పిన విషయం విని షాక్ అయ్యారు..

Kg Mangalsutra Gift  : భార్యకు కిలో బంగారు తాళి గిఫ్ట్ ఇచ్చిన భర్త..అసలు విషయం తెలిసి పోలీసులు షాక్

Kg Gold Mangalsutra Gift

Mumbai woman Kg gold Mangalsutra : మహారాష్ట్రలోని బివాండీకి చెందిన ఓ వ్యక్తి తన భార్యకు ఎవ్వరూ ఊహించనికానుక ఇచ్చాడు. ఎవరన్నా ఓ మూడు నాలుగు తులాలు తాళి చేయించి ఇస్తారు. కానీ బివాండీకి చెందిన బాలా అనే వ్యక్తి మాత్రం తన భార్యకు ఏకంగా కిలో అంటే 1000 గ్రాముల బరువున్న బంగారు తాళిని తమ పెళ్లిరోజు సందర్భంగా.. బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయం కాస్తా..సోషల్ మీడియాలో వైలర్ అయి పోలీసుల దృష్టికి వెళ్లటంతో సదరు భర్తగారిని ఎంక్వయిరీ చేయగా అతను చెప్పిన మాట విని పోలీసులు సైతం షాక్ అయ్యారు.



పెళ్లైన మహిళలు మామూలుగా తులాలలో మంగళసూత్రాన్ని చేయించుకుని మెడలో వేసుకోవటం పరిపాటి. అది కూడా పుట్టింటి వాళ్లో, అత్తింటి వాళ్లో తమ తాహతకు తగ్గట్టుగా చేయించి ఇచ్చినది ఉంటుంది. అధికంగా డబ్బు, బంగారంపై మోజు ఉంటే మామూలు కంటే కొన్ని ఎక్కువ తులాలతో మంగళసూత్రాన్ని చేయించుకుంటారు. కానీ, మహారాష్ట్రకు చెందిన ఓ మహిళకు ఆమె భర్త కేజీ బంగారంతో మంగళసూత్రాన్ని చేయించి కానుకగా ఇచ్చాడు. ఆ మంగళసూత్రం కాస్తా సోషల్‌ మీడియాలో వైరలై పోలీసుల దృష్టిని ఆకర్షించింది. దానిపై ఎంక్వైరీ చేసిన పోలీసులకు అసలు విషయం తెలిసి అవాకయ్యారు.పోలీసులను షాక్ కు గురి చేసిన ఆ విషయం ఏమిటంటే..



బివాండీలో నివసించే బాలా అనే వ్యక్తి తన భార్యకు కేజీ బంగారంతో తయారు చేసిన మంగళసూత్రాన్ని కానుకగా ఇచ్చాడు. సాధారణంగా మహిళల మెడలో మంగళసూత్రం గుండెల దాకా ఉంటుంది. లేదా ఇంకాస్త పొడుగు ఉంటుంది. కానీ ఈ కేజీ మంగళసూత్రం ఏకంగా ఆమె మోకాళ్ల వరకు పొడగు ఉంది. ఆ బంగారంలాంటి భారీ మంగళసూత్రాన్ని ధరించి ఆమెగారు..తనకు అంత భారీ బహుమతి ఇచ్చిన భర్తగారితో కలిసి రకరకాల యాంగిల్స్ లో ఫోజులు ఇస్తూ..వీడియో దిగింది.



ఆ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయి..పోలీసుల దృష్టికి వెళ్లటంతో బాలాను స్టేషన్‌కు పిలిపించి ‘ఏందీ భారీ మంగళసూత్రం’కథా కమామీషు..అని ఎంక్వైరీ చేశారు. దానికి బాలా ‘‘నా భార్యకు గిఫ్టుగా ఇచ్చిన ఒక కేజీ బంగారు మంగళసూత్రం నిజమైనది కాదని..నకిలీ బంగారం (గిల్టు) అని చెప్పాడు. బంగారు షాపునుంచి 38వేల రూపాయలకు కొన్నానని చెప్పటంతో పోలీసులు షాక్ అయ్యారు. దీంతో పోలీసులు అది నిజమా? కాదా? అని ఎంక్వయిరీ చేయగా బాలా చెప్పింది నిజమేనని తేలటం ఇక చేసేదేమీ లేక పోలీసులు అతడ్ని ఇంటికి పంపించేశారు.



దీనిపై ఓ పోలీస్‌ అధికారి మాట్లాడుతూ.. ‘‘ కేజీ బంగారు తాళి వీడియో వైరల్‌ మా దృష్టికి రావటంతో చోరీలు జరుగుతున్న క్రమంలో అది వారికి ప్రమాదమని..దాంతో అతడిని ఎంక్వయిరీకి పిలిపించామని తెలిపారు. అలాగే ఇలా బంగారు నగలు అని పబ్లిసిటీ చేసుకుంటే అది ప్రమాదాలకు దారి తీస్తుందనీ..ఇటువంటి పబ్లిసిటీలు దొంగల్ని ఆహ్వానించటమే. ప్రాణాలమీదకు తెచ్చుకోవటమనేనని తెలిపారు. అందుకే బాలా కోలిని పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించామని తెలిపారు.