Germany To India Bike journey : తల్లిదండ్రులను చూడటానికి జర్మనీ నుంచి భారత్‌కు బైక్‌పై యువతి ప్రయాణం

తల్లిదండ్రులను చూడటానికి జర్మనీ నుంచి భారత్‌కు బైక్‌పై యువతి ప్రయాణించింది. 156 రోజులు 24,000 కిలోమీటర్లు బైక్ పై ప్రయాణించి ముంబై చేరుకుని తల్లిదండ్రులను కలుసుకుంది.

Germany To India Bike journey : తల్లిదండ్రులను చూడటానికి జర్మనీ నుంచి భారత్‌కు బైక్‌పై యువతి ప్రయాణం

Mumbai Women Germany To India Bike journey

Mumbai Women Germany To India Bike journey : ఎంతోమంది బైక్ ప్రయాణాలు చేస్తుంటారు. కొంతమంది టూర్ల కోసం మరికొంతమంది రికార్డుల కోసం..ఇంకొంతమంది సాహస యాత్ర కోసం చేస్తుంటారు.కానీ కొన్ని ప్రయాణాలు మాత్రం బంధాల కోసం అనుబంధాల కోసం జరుగుతుంటాయి. ఇదిగో ఈ యువతి ప్రయాణం కూడా అటువంటిదే. తల్లిదండ్రులను చూడటానికి ఏకంగా 156 రోజుల పాటు 24వేల కిలోమీటర్లు బైక్ పై ప్రయాణించింది. ఆమెకు బైక్ నడపటం రాదు..అయినా అమ్మానాన్నలను చూడటానికి ఓ వినూత్న ప్రయాణం ద్వారా రావాలని అనుకుంది. అంతే బైక్ నడపటం నేర్చుకుంది. అలా జర్మనీ నుంచి భారతదేశానికి బైక్ పై 156 రోజుల పాటు 24వేల కిలోమీటర్లు ప్రయాణించింది ముంబైకు చెందిన మేధా రాయ్‌ అనే యువతి. ఈ ప్రయాణం వెనుక ఉన్నది కరోనా మహమ్మారి అలాగే..ఓ ప్రేమ కథ..ఉన్నాయి..!

కరోనా మహమ్మారి కమ్మేసిన వేళ ఎంతోమంది పేదలు, నిరుపేదలు కాలి నడకన..సైకిల్ పై వృద్ధులు,చిన్నారులు..మహిళలు ఇలా ఎంతోమంది ప్రయాణాలు చేసిన దృశ్యాల కరోనా మహమ్మారి ప్రభావమే. ఆ మహమ్మారే మేధా రాయ్ ప్రయాణానికి కూడా ఓ కారణంగా మారింది. జర్మనీ నుంచి భారత్‌కు రావాలంటే ఎవరైనా విమానంలో వస్తారు.కానీ ముంబయికి చెందిన మేధా రాయ్‌ మాత్రం తన భర్తతో కలిసి.. బైక్‌పై 156 రోజుల్లో ఏకంగా 24 వేల కిలోమీటర్లు ప్రయాణించి ముంబయికి చేరుకుంది.

జర్మనీకి చెందిన హాక్‌ విక్టర్‌ అనే యువకుడు 2013లో ముంబయికి వచ్చాడు. అప్పుడు విక్టర్ కు మేధాతో పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారింది. ఆ తరువాత మేథా జర్మనీ వెళ్లింది. అలా వారు 2021లో కొవిడ్‌ లాక్‌డౌన్‌ వేళ జర్మనీలో వారు వివాహం చేసుకున్నారు. కరోనా ఆంక్షల వల్ల మేధా కుటుంబం పెళ్లికి వెళ్లలేకపోయింది. దీంతో మేథా బాధపడింది. జీవితంలో అతి ముఖ్యమైన తన వివాహానికి అమ్మానాన్నలు లేకపోయారని బాధపడింది. ఈ క్రమంలో జర్మీనలో లాక్ డౌన్ ఆంక్షల సడలింపు తర్వాత అమ్మానాన్నలను చూడాలని తపనపడింది. విమానంలో రావచ్చు. కానీ ఓ వినూత్న ప్రయాణంతో అమ్మానాన్నలను చూడానుకుంది మేధా..

అలా ఇద్దరు ఆలోచించుకుని బైక్ పై జర్మనీ నుంచి ముంబైకు రావాలనుకున్నారు. కానీ మేధాకు బైక్ నడపటం రాదు. కానీ అమ్మానాన్నలను బైక్ ప్రయాణంతో చూడాలనే సంకల్పంతో ఆమె బైక్ నడపటం నేర్చుకుంది. పైగా ఇద్దరూ ఒకే బైక్ మీద వస్తే సుదీర్ఘ ప్రయాణంకాబట్టి ఆరోగ్య సమస్యలు (వెన్నునొప్పి వంటివి) రావచ్చని ఆలోచించి తాను బైక్ నడపటం నేర్చుకుంది. అలా మరో బైక్ కొని భార్యా భర్తలు ఇద్దరు కలిసి బైకులపై ప్రయాణించి ముంబయికి వచ్చేశారు. అది మేధా బైక్ జర్నీ..