174 మంది వలస కార్మికులకు విమాన ప్రయాణం కల్పించిన Law విద్యార్థులు

  • Published By: Subhan ,Published On : May 29, 2020 / 11:54 AM IST
174 మంది వలస కార్మికులకు విమాన ప్రయాణం కల్పించిన Law విద్యార్థులు

తొమ్మిది సంవత్సరాల కృష్ణా మందాల్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. తన కళ్ల ముందే ముంబైలోని పొడవాటి బిల్డింగులు చేతి వేళ్ల సైజులో కనపడుతున్నాయి. అతని 12ఏళ్ల అన్న మేఘాలను పట్టుకోవాలని ఆరాటపడుతున్నాడు. ఎయిర్ ఏసియా విమానంలో ఎక్కి ముంబై నుంచి రాంచీకి ప్రయాణం అవుతున్న వారి సంతోషం వెలకట్టలేనిది. గురువారం ఉదయం ఆటో డ్రైవర్ అయిన తండ్రి రాజేంద్ర తులసీ మండాల్(47)తో కలిసి ప్రయాణిస్తున్నారు. 

మధ్యాహ్న సమయానికి పిల్లలతో సహా కొడుకు ఏక్తా గ్రామంలోని ఇంటికి చేరుకున్నాడు. వాళ్ల ముగ్గురికి ఇదే తొలి విమాన ప్రయాణం. ఈ ముగ్గురితో కలిపి 174మంది వలస కార్మికులు ఇదే తొలి గగన ప్రయాణం. లాక్‌డౌన్ కారణంగా ముంబైకి చెందిన కార్మికులు ఇరుక్కుపోవడంతో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (NLSIU) విద్యార్థులు వారిని సొంతూళ్లకు చేర్చారు. 

‘నా జీవితంలో ఇలాంటి విచారాన్ని ఎప్పుడూ ఫేస్ చేయలేదు. విమానంలో ప్రయాణిస్తున్న ఆనందాన్ని ఎన్నడూ ఎదుర్కోలేదు. నాకు దేవుడు ఉన్నాడని తెలిసింది’ అని రాజేంద్ర అంటున్నాడు. ఈ లా విద్యార్థులు కార్మికులను ఇళ్లకు పంపేందుకు రూ.12లక్షల విరాళాలు పోగు చేశారు. ముంబైలోని ఘట్కోపర్ లో 2కొడుకులతో పాటుగా అద్దె ఇంట్లో ఉంటున్నాడు రాజేంద్ర. అతని భార్య కూతురు సొంతూరిలో ఉంటారు.

‘లాక్‌డౌన్ కారణంగా పనిలేకుండా పోయింది. నా దగ్గర డబ్బులు అయిపోయాయి. రెండు నెలలుగా చాలా తక్కువ తింటున్నాం. నా భార్య ఫోన్లో ఏడుస్తూ ఉంటుంది. నాకు ఒకటే బాధ. పిల్లల్ని తిరిగి ఎలా తీసుకెళ్లాలని. చాలా మంది నడుచుకుంటూ వెళ్లిపోయారు. కొందరు చేరుకున్నా మరికొంత మంది చనిపోయారు. నా పిల్లల్ని అలాంటి ప్రమాదంలోకి నెట్టలేను’ అని అన్నాడు. 

విమానంలో ఎక్కిన తర్వాత పిల్లలు వాళ్లమ్మ ధనేశ్వరీ దేవీ(40)కు కాల్ చేశారు. కొద్ది గంటల్లో వచ్చేస్తామని చెప్పారు. మేఘాల పైనుంచి నీళ్లను, బిల్డింగులను చూశా. విమానం చల్లగా ఉంది. కానీ, భయంగా లేదు’ అని కృష్ణ చెప్పుకొచ్చాడు. ‘పిల్లలు విమానం ప్రయాణాన్ని, మేఘాల గురించి మాట్లాడటం ఆపడం లేదు. మేమందరం కలిసినందుకు గొప్పగా ఫీలవుతున్నా’ అని చెప్పింది. 

కొద్ది రోజుల ముందు రాజేంద్ర ఫోన్ రింగ్ అయింది. ఇంటికి తిరిగి వెళ్లడానికి విమానం ఏర్పాటు చేస్తున్నారని తెలిసింది. ‘అంతేకాకుండా ఆ గ్రూప్ మమ్మల్ని ఎయిర్ పోర్ట్ దగ్గర విడిచిపెట్టింది. ఒక్క రూపాయి కూడా మేం ఇవ్వలేదు. రాంచీ ఎయిర్‌పోర్టులో దిగిన తర్వాత బాగోదర్ కు జార్ఖండ్ సీఎం బస్సులు ఏర్పాటు చేశారు. ముంబై నుంచి జార్ఖండ్ వెళ్లడానికి కేవలం నేను ఖర్చు పెట్టింది రూ.150మాత్రమే’ అని ఆ కార్మికుడు ఆవేదనను వెల్లగక్కాడు. 

Read: India పదాన్ని తొలగించి ‘Bharat’ మాత్రమే వాడాలని జూన్ 2న సుప్రీం కోర్టులో వాదనలు