Sushil Kumar: హత్యకేసు నిందితుడితో ఫోటోలు దిగిన పోలీసులు

ఈ ఫోటోలు ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో దర్యాప్తుకు ఆదేశించారు. ఓ హత్య కేసు నిందితుడితో ఫోటోలు దిగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ హత్యకేసు వ్యవహారంలో సుశీల్ తోపాటు మరో 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. ఈ హత్యకు ఆస్థి తగాదాలే కారణంగా తెలుస్తుంది

Sushil Kumar: హత్యకేసు నిందితుడితో ఫోటోలు దిగిన పోలీసులు

Sushil Kumar

Sushil Kumar: హత్యకేసు నిందితుడు, ఒలంపిక్ పతక విజేత సుశీల్ కుమార్ తో పోలీసులు ఫోటోలు దిగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. వివరాల్లోకి వెళితే మే 4వ తేదీ అర్ధరాత్రి సమయంలో 23 ఏళ్ల యువ రెజ్లర్ పై సుశీల్ కుమార్ తన స్నేహితులతో కలిసి దాడి చేశాడు.

ఈ దాడిలో గాయపడిన యువ రెజ్లర్ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో సుశీల్ కుమార్ హత్యచేసినట్లు తేలింది. దీంతో పరారీలో ఉన్న సుశీల్ ని పోలీసులు మే 23 తేదీ అరెస్ట్ చేసి అతడిని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడికి 33 రోజుల రిమాండ్ విధించింది. రిమాండ్ సమయంలో మాండోలి జైల్లో ఉంచారు అధికారులు.

ఇక శుక్రవారంతో రిమాండ్ ముగియడంతో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ మయాంక్ అగర్వాల్ ముందు హాజరుపరిచారు. దీంతో ఆయన మరో 14 రోజులు రిమాండ్ విధించారు. మాండోలి జైలు నుంచి తిహార్ జైలుకు తరలించాలని తెలిపారు. కాగా మాండోలి జైలు నుంచి తిహార్ జైలుకు తరలిస్తున్న సమయంలో అక్కడ ఉన్న పోలీస్ అధికారులు సుశీల్ కుమార్ తో ఫోటోలు దిగారు.

ఈ ఫోటోలు ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో దర్యాప్తుకు ఆదేశించారు. ఓ హత్య కేసు నిందితుడితో ఫోటోలు దిగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.  కాగా ఈ హత్యకేసు వ్యవహారంలో సుశీల్ తోపాటు మరో 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. ఈ హత్యకు ఆస్థి తగాదాలే కారణంగా తెలుస్తుంది.