వీడిని ఏం చేయాలి, డాక్టర్ పై ఉమ్మేసిన కరోనా పేషెంట్, హత్యాయత్నం కేసు నమోదు

తమ ప్రాణాల పణంగా పెట్టి కరోనా బాధితులకు ట్రీట్ మెంట్ చేస్తున్నారు డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది. విపత్కర పరిస్థితుల్లోనూ ఎంతో ధైర్యంగా వారు విధులు నిర్వహిస్తున్నారు.

  • Published By: veegamteam ,Published On : April 13, 2020 / 02:46 AM IST
వీడిని ఏం చేయాలి, డాక్టర్ పై ఉమ్మేసిన కరోనా పేషెంట్, హత్యాయత్నం కేసు నమోదు

తమ ప్రాణాల పణంగా పెట్టి కరోనా బాధితులకు ట్రీట్ మెంట్ చేస్తున్నారు డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది. విపత్కర పరిస్థితుల్లోనూ ఎంతో ధైర్యంగా వారు విధులు నిర్వహిస్తున్నారు.

తమ ప్రాణాలు పణంగా పెట్టి కరోనా బాధితులకు ట్రీట్ మెంట్ చేస్తున్నారు డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది. విపత్కర పరిస్థితుల్లోనూ ఎంతో ధైర్యంగా వారు విధులు నిర్వహిస్తున్నారు. కరోనా వ్యాపిస్తుందని తెలిసినా భయపడకుండా, త్యాగాలు చేసి మరీ డ్యూటీ చేస్తున్నారు. వారి సేవలను ఎంత ప్రశంసించినా తక్కువే. యావత్ ప్రపంచం వైద్య సిబ్బందికి చేతులెత్తి నమస్కరిస్తోంది. కాగా కొందరు కరోనా బాధితులు ఉన్మాదుల్లా వ్యవహరిస్తున్నారు. మరీ ముఖ్యంగా తబ్లిగీ జమాత్ సభ్యులు. ట్రీట్ మెంట్ చేసే డాక్టర్లు, నర్సుల పట్ల వారు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. కొందరు నీచులు తమ వికృత చర్యలతో వారిని భయాందోళనకు గురి చేస్తున్నారు.

తబ్లిగీ జమాత్ సభ్యుడి వికృత చర్య:
ఇదివరకు ఢిల్లీలోని క్వారంటైన్ లో కరోనా అనుమానితులు డాక్టర్లపై ఉమ్మివేసి వికృత చర్యలకు పాల్పడిన సంగతి తెలిసింది. తాజాగా అలాంటి ఘటనే తమిళనాడు తిరుచురాపల్లిలోని మహత్మా గాంధీ మెమోరియల్ ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వార్డులో చికిత్స అందిస్తున్న సమయంలో డాక్టర్ తో దురుసుగా ప్రవర్తించాడు కరోనా బాధితుడు. మాస్కును విసిరేసిన అతడు.. డాక్టర్, నర్సు ముఖంపై ఉమ్మివేసాడు. దీంతో డాక్టర్, ఆస్పత్రి సిబ్బంది షాక్ తిన్నారు. అతడి వికృత చర్యతో భయాందోళనకు గురయ్యారు.

ఉమ్మివేసిన వ్యక్తిపై హత్యాయత్నం కేసు:
దీన్ని సీరియస్ గా తీసుకున్న అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ కరోనా బాధితుడిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఇది చాలా తీవ్రమైన చర్యగా పోలీసులు అభివర్ణించారు. కరోనా వ్యాపించేలా అతడి చర్యలు ఉన్నాయన్నారు. సదురు వ్యక్తి కరోనా లక్షణాలతో శనివారం(ఏప్రిల్ 11,2020) ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. ఆసుపత్రిలో అడ్మిట్ అయినప్పట్టి నుంచి ఆ వ్యక్తి దురుసుగా ప్రవర్తిస్తున్నాడని, తమకు సహకరించడం లేదని వైద్య సిబ్బంది వాపోయారు. ఢిల్లీ మర్కజ్ నుంచి వచ్చిన 36మంది తబ్లిగీ జమాత్ సభ్యులకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారిలో 40ఏళ్ల వయసున్న ఒకడు వైద్య సిబ్బందిపై ఉమ్మేశాడు.

కరోనా కేసుల్లో మూడో స్థానంలో తమిళనాడు:
దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తమిళనాడు ఒకటి. మహారాష్ట్ర, ఢిల్లీ తర్వాత 969 కరోనా కేసులతో తమిళనాడు మూడో స్థానంలో ఉంది. రాష్ట్రంలో 10మంది కరోనాతో చనిపోయారు. ఇక తిరుచురాపల్లిలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ జిల్లాలో 39 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తమిళనాడు రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువున్న జిల్లాల్లో తిరుచురాపల్లి 9వ స్థానంలో ఉంది.